Hyderabad: హైదరాబాద్‌లో డేటింగ్ యాప్ మోసం.. ఓయో రూమ్‌లో డాక్టర్‌పై దాడి, బ్లాక్‌మెయిల్!

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డేటింగ్ యాప్ మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. గ్రీండర్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు, డాక్టర్ జీవితాన్ని కుదిపేశాడు. ఆ పరిచయం చివరికి ఓయో రూమ్‌లో దాడి, బ్లాక్‌మెయిల్ డ్రామాగా మారింది.

Hyderabad: వివరాల్లోకి వెళ్తే.. గ్రీండర్ యాప్ ద్వారా ఓ డాక్టర్‌కి ఒక యువకుడు పరిచయమయ్యాడు. కొంతకాలం చాటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. అక్కడే అసలు కథ మలుపు తిరిగింది.

ఇది కూడా చదవండి: Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాల హెచ్చరిక!

కలుసుకున్న రోజు యువకుడు, డాక్టర్‌పై అత్యాచారం చేయడానికి యత్నించాడు. ప్రతిఘటించిన డాక్టర్‌పై కోపంతో దాడి చేశాడు. అంతేకాదు తనకు డబ్బులు ఇవ్వకుంటే ప్రైవేట్‌గా కలిసిన విషయాన్ని బయటపెడతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ డాక్టర్, రూ.5 వేలు ఇచ్చాడు.

కానీ, అక్కడితో ఆగలేదు నిందితుడు. ఆ డాక్టర్‌ను ఫాలో చేసి, అతడు పనిచేస్తున్న హాస్పిటల్‌కి వెళ్లి కూడా న్యూసెన్స్ సృష్టించాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ కొనసాగించాడు. చివరకు గత్యంతరం లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ప్రస్తుతం కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మరోసారి డేటింగ్ యాప్‌ల వాడకంపై చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *