Sahasra: హైదరాబాద్ కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక సహస్రపై దారుణ హత్య జరిగింది. ఈ ఘటనపై స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పదేళ్ల అమాయక బాలికను కత్తితో పొడిచి పొడిచి చంపేసిన ఘటన హృదయాన్ని కదిలిస్తోంది. సహస్ర శరీరంపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంత చిన్నారిని ఇంత క్రూరంగా చంపడానికి నిందితుడి మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదు.
Sahasra: ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకున్నప్పటికీ, బాలిక హత్య వెనక గల మిస్టరీ ఇంకా బయటపడలేదు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను విచారించగా, మరికొందరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పోస్టుమార్టం సమయంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సహస్ర శరీరంపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. దుండగుడు సుమారు 25 ఏళ్ల వయసున్న వ్యక్తి అయ్యి ఉంటాడని అంచనా వ్యక్తం చేశారు. దీంతో రిపోర్ట్ పోలీసులు దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.
సోమవారం జరిగిన ఈ ఘోర హత్యలో, బాలిక తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లిన సమయంలో దుర్మార్గుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్రను కత్తితో పొడిచి చంపేసాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన తండ్రి ఈ దారుణం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ హత్యపై కూకట్పల్లి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంత చిన్నారిని ఇలాంటి దారుణానికి గురిచేసిన నిందితుడిని ఎంత కఠినంగా శిక్షించినా తక్కువేనని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకుని చట్టపరమైన కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
