Crime News: తిరుపతి నగరంలో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువ జంట అనూష, వెంకటరాజులు స్థానిక లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ వదిన – మరిది కావడంతో వారి ప్రేమను కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. పెళ్లి సాధ్యం కాదని భావించి చివరికి ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నారు.
Crime News: గ్రూప్ థియేటర్స్ ఎదురుగా ఉన్న కృష్ణ లాడ్జిలో బస చేసిన ఈ జంట శుక్రవారం రాత్రి గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఉదయం లాడ్జి సిబ్బంది పలుమార్లు తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు లోపలికి వెళ్లి చూసేసరికి, అనూష ఫ్యాన్కు ఉరివేసుకుని ఉండగా, వెంకటరాజు ఇనుపరాడ్కు ఉరివేసుకుని కనిపించాడు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ ప్రేమను కుటుంబం అంగీకరించకపోవడంతో ఇక జీవించడం కష్టమనిపించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. వదిన–మరిది అనుబంధం ఉన్నందువల్లే పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని అందులో రాశారు.
అనూష మార్చిలోనే ఇంటి నుంచి అదృశ్యమైంది. ఈ మేరకు కర్ణాటకలోని వి.కోట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దాదాపు ఐదు నెలలు ఊరికి దూరంగా ఉన్న ఈ జంట చివరికి తిరుపతికి చేరుకుని ఈ దారుణ నిర్ణయం తీసుకుంది.
ప్రేమజంట మృతదేహాలను రుయా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. ఈస్ట్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
