Income Tax Rules: ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు? ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయి!

Income Tax Rules: మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది – ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంచుకోవడం చట్టవిరుద్ధమా? ఆదాయపు పన్ను శాఖ (Income Tax Dept) ఏమైనా గరిష్ట పరిమితి విధించిందా? అనేది అందరికీ తెలుసుకోవాలనిపించే విషయం.

Income Tax Rules: ఇంట్లో నగదు ఉంచుకోవడానికి చట్టంలో ఎలాంటి పరిమితి లేదు. అంటే మీరు ఎంత మొత్తం అయినా ఉంచుకోవచ్చు. కానీ ముఖ్యమైన షరతు – ఆ డబ్బు చట్టబద్ధంగా సంపాదించబడాలి. మీరు సంపాదించిన ఆదాయానికి సరిపడే విధంగా పన్నులు చెల్లించి ఉండాలి. అదేవిధంగా ఆ వివరాలు మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR)లో చూపించాలి.

ఒక వేళ ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహించినప్పుడు మీ వద్ద ఉన్న నగదు మూలాన్ని మీరు నిరూపించలేకపోతే, ఆ డబ్బును వివరించలేని ఆదాయం (Unaccounted Income)గా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 68 నుండి 69B వరకు ఈ అంశాలను స్పష్టంగా పేర్కొంటాయి. ఈ పరిస్థితుల్లో 78 శాతం వరకు పన్ను మరియు జరిమానా విధించబడే అవకాశం ఉంది.

డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం
చట్టంలో పరిమితి లేకపోయినా, మీ వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదు అనుమానాలకు దారితీస్తుంది. అందువల్ల –

  • జీతం లేదా వ్యాపార ఆదాయం ద్వారా వచ్చిందని నిరూపించే రికార్డులు ఉండాలి.

  • వ్యాపారస్తులు అయితే క్యాష్‌బుక్‌లోని లెక్కలు ఖాతా పుస్తకాలతో సరిపోవాలి.

  • ITR ఫైలింగ్‌లో సరిగ్గా వివరాలు నమోదు చేయాలి.

 మన దేశంలో ఇంట్లో నగదు ఉంచుకోవడం చట్ట విరుద్ధం కాదు. కానీ డబ్బు నిజాయితీగా సంపాదించబడాలి, పారదర్శకంగా ప్రకటించాలి, అవసరమైనప్పుడు డాక్యుమెంట్లతో నిరూపించగలగాలి. అప్పుడు ఎంత మొత్తం ఉన్నా ఎలాంటి భయం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *