Pawan Kalyan: థియేటర్‌లో ఫ్యాన్స్‌తో పాటు సందడి చేసిన అకిరా, ఆద్య, సాయి..ఓజీ సెలెబ్రేషన్స్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఓజీ సినిమా చివరికి విడుదలై బాక్సాఫీస్ వద్ద హవా మొదలెట్టింది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొని, పవన్ ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా క్యూ కడుతూ సినిమాను ఆస్వాదించారు.

Pawan Kalyan: సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలలో మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, పవన్ కుమారుడు అకీరా, కుమార్తె ఆద్య కలిసి సినిమా చూస్తున్న దృశ్యాలు హైలైట్ అయ్యాయి. ఫ్యాన్స్‌తో పాటు స్టార్ ఫ్యామిలీ థియేటర్‌లో కనిపించడం అభిమానుల్లో అదనపు ఉత్సాహాన్ని రేపింది.

ఇది కూడా చదవండి: OG Movie Review: పవన్ ఫాన్స్ కు పూనకాలు.. మాట నిలబెట్టుకున్న సుజిత్! బీభత్సమే భయ్యా!

గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ గంభీరమైన ఓజాస్ పాత్రలో కనిపించారు. ఆయన నటన సినిమాకే హైలైట్ అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ప్రీమియర్ షో చూసిన హీరో నాని, దర్శకుడు బాబీ సోషల్ మీడియాలో స్పందిస్తూ “ఇది బ్లాక్‌బస్టర్” అని క్లారిటీ ఇచ్చారు. “పవర్‌స్టార్‌ ఒక అద్భుతం. సుజీత్‌, తమన్‌ల మ్యాజిక్ అద్భుతంగా పనిచేసింది” అంటూ బాబీ కామెంట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Mukesh G (@celebritys.news)

ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, రిలీజ్‌కు ముందుగానే టికెట్ల అమ్మకాలతోనే సుమారు రూ.60 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. పవన్ గతంలో చేసిన ఖుషి తర్వాత ఇంత జోష్ మళ్లీ ఓజీకి మాత్రమే కనిపించిందని అభిమానులు అంటున్నారు.

ముంబయి, జపాన్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం, పవన్ ఎలివేషన్స్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రం, పవన్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *