Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాల హెచ్చరిక!

Heavy Rains: హైదరాబాద్‌పై వర్షాల మోసం ఇంకా తగ్గలేదు. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా రాష్ట్రంలో వానలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యలు, వరద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వాతావరణ శాఖ తాజాగా మరో కీలక హెచ్చరిక జారీ చేసింది.

Heavy Rains: ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడుతుందని అంచనా. అయితే, ఈ రోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఇది క్రమంగా బలపడి వాయువ్య దిశగా కదులుతూ రాబోయే రోజుల్లో వాయుగుండంగా మారనుంది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాన్ని ఎల్లుండి తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: OG Movie First Review: ఓజీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. థియేటర్లు దద్దరిల్లిపోతాయ్!

ఈరోజు వర్షాలు పడే జిల్లాలు:

ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

రేపటి హెచ్చరిక:

నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతిభారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరించింది.

ఎల్లో అలెర్ట్ జారీ చేసిన జిల్లాలు:

ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు.

వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం, ఈ రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *