Rishabh Pant: రిషబ్ పంత్ రీఎంట్రీ జరగాలంటే ఆ ఒక్కటి చేస్తేనే!

Rishabh Pant: భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ త్వరలో క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల చివరిలో జరగనున్న రంజీ ట్రోఫీ 2025/26 ద్వారా అతను ఢిల్లీ జట్టు తరఫున రిటర్న్ ఇవ్వనున్నాడు.

Rishabh Pant: అయితే, రిటర్న్‌కు ముందుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మెడికల్ క్లియరెన్స్ పొందడం తప్పనిసరి. సెప్టెంబర్ మధ్య నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్న పంత్, వచ్చే వారం కుడి కాలి గాయాన్ని వైద్య నిపుణులు మరోసారి పరిశీలించనున్నారు. కోలుకుంటున్న తీరును బట్టి, పంత్ త్వరలోనే ఫిట్ అని నిర్ధారణ వస్తే, అక్టోబర్ 25 నుంచి ఢిల్లీలో జరగనున్న రెండు రంజీ మ్యాచ్‌లలో ఆ ఆటగాడు పాల్గొనవచ్చు.

ఇది కూడా చదవండి: Guinness Record: అసలు అన్ని ఎలా వాడేశావురా..ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

గత జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి, పంత్ తన కుడి కాలి మెటాటార్సల్ గాయంతో 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఫ్రాక్చర్ నిర్ధారణ అయినప్పటికీ, పంత్ తర్వాత రోజు మూన్‌బూట్‌తో 54 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరచాడు. ఈ కారణంగా, ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ మరియు అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనకు అతను దూరమయ్యాడు.

పంత్ రిటర్న్ అయితే, భారత టెస్ట్ జట్టుకు అతని అనుభవం, దూకుడు చాలా ఉపయోగపడుతుంది. గత ఇంగ్లాండ్ సిరీస్‌లో, పంత్ ఏడు ఇన్నింగ్స్‌లో 479 పరుగులు చేసి, రెండు సెంచరీలు సాధించాడు. రంజీలో మంచి ప్రదర్శన చేయగలిగితే, నవంబర్ 14 నుంచి కోల్‌కతాలో జరగనున్న సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం జట్టులో ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *