Guinness Record: అసలు అన్ని ఎలా వాడేశావురా..ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Guinness Record: హైదరాబాద్‌కు చెందిన మనీష్ ధమేజా ప్రపంచంలోనే అత్యధిక క్రెడిట్ కార్డులు వాడిన వ్యక్తిగా గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించాడు. అతను ఏకంగా 1,638 యాక్టివ్ క్రెడిట్ కార్డులు వాడుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Guinness Record: మనీష్ చెప్పకోచేసేది ఏమిటంటే, క్రెడిట్ కార్డులు కేవలం ఆర్థిక అవసరాలకోసం మాత్రమే కాదు, అవి తనకు ఇష్టం అని. “క్రెడిట్ కార్డు నాకు అవసరం మాత్రమే కాదు, అవి లేకుండా నా జీవితం అసంపూర్ణం. వాటి ద్వారా వచ్చే రివార్డులు, గిఫ్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి,” అని మనీష్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Street Dog: వీధి కుక్కల బెడదపై నాటకం.. పాత్రలో జీవించేసిన కుక్క వైరల్ వీడియో!

2016లో మన దేశంలో జరిగిన నోట్ల రద్దు సమయంలో మనీష్ మొదటగా డిజిటల్ పేమెంట్స్ వాడడం ప్రారంభించాడు. ఆ సమయంలో తన ఖర్చుల కోసం కరెన్సీకి బదులుగా క్రెడిట్ కార్డులు ఉపయోగించడం అలవాటు అయింది. తరువాత, క్రెడిట్ కార్డులు అందించే రివార్డులు, డిస్కౌంట్లు, ప్రయాణ బెనిఫిట్స్ వంటి ఫ్యాక్టర్లు దృష్టిలో పెట్టుకుని మనీష్ వాటి సంఖ్యను వేగంగా పెంచుకుంటూ 1638కు చేరుకున్నాడు.

క్రెడిట్ కార్డుల వల్ల మనీష్ ట్రావెల్, హోటల్స్, ఫుడ్, స్పా, షాపింగ్, సినిమా టిక్కెట్లు, గోల్ఫ్ సెషన్‌లు వంటి అనేక సౌకర్యాలను పొందగలిగాడు. ఈ విధంగా, అత్యధిక యాక్టివ్ క్రెడిట్ కార్డులు వాడిన వ్యక్తిగా గిన్నీస్ రికార్డులోకి ఎక్కాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *