Viral Sport: మనకి శ్మశానం అంటే భయం. అక్కడ మృతదేహాలకు చేసే చివరి సంస్కరణల గురించి మాట్లాడుకోవడం సాధారణంగా జరగదు. అయితే, మన ఆచారం అగ్నికి మృతదేహాన్ని సమర్పించడం. కానీ, ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మృతదేహాల్ని సమాధి చేస్తారు. సమాధి కోసం గోతిని తవ్వడం మామూలే. కానీ, ఏ చావూ లేకుండానే.. సమాధులు తవ్వితే.. దానికోసం ఒక పోటీ పెడితే.. మరి అదే విచిత్రం. అందుకే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం.
Viral Sport: హంగేరీలోని ఒక చిన్న పట్టణం సక్జాయ్, ప్రతి సంవత్సరం సమాధులు తవ్వే పోటీని నిర్వహిస్తుంది. ఈమధ్యనే ఈ కార్యక్రమం మళ్ళీ నిర్వహించారు. ఈ పోటీ జనాలకు చాలా ఆకర్షణగా మారింది.
సెర్బియా, చెక్ రిపబ్లిక్, రష్యాతో సహా మరో మూడు దేశాల నుండి మొత్తం 17 టీమ్స్ ఈ పోటీలో పాల్గొన్నాయి.
ఈ పోటీని అంతర్జాతీయ స్థాయిలో రెండవసారి నిర్వహించారు. ఆటగాళ్ళు 1.6 మీటర్ల లోతు, 80 సెం.మీ వెడల్పు, 2 మీటర్ల పొడవు గల సమాధిని రెండు గంటల్లో తవ్వాల్సి వచ్చింది.
ఇందులో దాదాపు 2.5 టన్నుల మట్టి బయటకు వచ్చింది. దీనిని 15 నిమిషాల్లో తిరిగి ఆ సమాధుల్లో నింపాలి. ఇదీ పోటీ.
ఈసారి, హంగేరీకి చెందిన లాజ్లో కిస్ – రాబర్ట్ నాగి మూడవసారి టైటిల్ను గెలుచుకున్నారు. వారు సవాలును 1 గంట, 33 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేశారు. విజేతలు బంగారం, వెండి, కాంస్యంతో తయారు చేసిన పార ఆకారపు ట్రోఫీలను అందుకున్నారు. రష్యన్ జట్టు పోటీలో చివరి స్థానంలో నిలిచింది.
అదండీ విషయం.. పరుగు పందాలు.. లేమాన్ స్పూన్ ఇవే కాదు.. ఇలా సమాధులు తవ్విపోసే విచిత్ర పోటీలు ప్రపంచంలో చాలానే జరుగుతూ ఉంటాయి.
