Narsaiah Thatha: బిగ్ బాస్ ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంత మంది ఆడిపోసుకున్నా.. ఎలాంటి వివాదాలు వచ్చినా అప్రతిహతంగా సాగిపోతున్న షో. బిగ్ బాస్(Bigg Boss 9) తెలుగులో ఇప్పుడు 9వ సిరీస్ ప్రసారానికి రెడీ అయిపోతోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ ని సామాన్యుల నుంచి, యూట్యూబ్ ఇన్ ఫ్ల్యూఎన్సర్స్ నుంచి సెలక్ట్ చేసుకోవడానికి కొత్త ఆట మొదలు పెట్టారు. అదే.. బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఇందులో బిగ్ బాస్ లో పాల్గోవాలనే ఆసక్తి తో వచ్చిన వందలాది మందిని వడపోసి.. వారిలో ఓ నలభై మందిని ముందుగా సెలక్ట్ చేసుకున్నారు. వీరిలో 15 మందిని సెకండ్ రౌండ్ కి పంపిస్తామని చెబుతున్నారు. వారిలో ఐదుగురికి బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ ఇస్తారు. ఇదీ ప్రాసెస్. దీనికి అగ్నిపరీక్ష అని పేరు పెట్టారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ అయిపోయాయి. (రోజూ ఒక ఎపిసోడ్ ప్రసారం చేస్తున్నారు. మొదటిది 22వ తేదీన వచ్చింది. రెండోది ఈరోజు 23న ప్రసారం అయింది.)
Narsaiah Thatha: ఈ అగ్నిపరీక్షకు జడ్జీలుగా నవదీప్, బిందుమాధవి, అభిజిత్ వ్యవహరిస్తున్నారు. యాంకర్ గా శ్రీముఖి ఉంది. ఒక్కో కాంటెస్ట్ ను పిలవడం.. వారి గురించి అడగడం.. తరువాత బిగ్ బాస్ లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నావు అని ప్రశ్నించడం.. తరువాత ఎదో పిచ్చి టాస్క్ ఇవ్వడం.. అది కూడా చూశాకా అబ్బే.. నువ్వు బిగ్ బాస్ కు పనికిరావు అని కొందరికి.. చూద్దాం అని కొందరికి చెప్పి పంపించడం. ఇదీ అగ్నిపరీక్షలా జాలుగుతున్న తతంగం. సరే ఎదో షో.. వాళ్ళిష్టం.. ఎవరిని సెలక్ట్ చేసుకుంటారో.. ఎందుకు సెలక్ట్ చేసుకుంటారో.. కానీ, మరీ టాస్క్ లు ఇచ్చి.. ఇంతా కష్టపడ్డాకా నువ్వు పనికిరావు అంటూ రిజెక్ట్ చేయడం కాస్త అతిగా అనిపిస్తోంది.
Narsaiah Thatha: మొదటిరోజు ఎదో కాస్త సో.. సో.. ప్రయత్నిస్తున్నారు.. ఫర్వాలేదు అనుకునేలోపు.. రెండో ఎపిసోడ్ లోనే కావలసినంత పైత్యం చూపించారు. ముఖ్యంగా ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ గళమెత్తి.. తన పాటతో ఉర్రూతలూగించిన నర్సయ్య టాటా విషయంలో జడ్జీలు కానీ, యాంకర్ కానీ చేసిన అతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నర్సయ్య తాతగా చెప్పుకునే నీల నర్సింహా యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురానికి చెందిన వారు. తన వారసత్వ వృత్తి అయినాగొర్రెల కాపరిగా ఉంటున్నారు. ఆయన చదివింది పదో తరగతి వరకే. అయినా సాహిత్యం మీద పట్టు.. అద్భుతమైన ఫోక్ సాంగ్స్ రాసి పాడడం తో బాగా పాప్యులర్ అయ్యారు. ఆయన పాట ఎంతలా ఫేమస్ అయింది అంటే.. ఒకసారి కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకుని నర్సయ్య తాతతో కలిసి భోజనం చేసేంత. ప్రపంచ తెలుగు మహాసభల్లో గళమెత్తి పాడేంతగా.. నర్సయ్య తాత ఎదిగారు.
Narsaiah Thatha: అటువంటి ఆయన బిగ్ బాస్ అగ్నిపరీక్షకు వచ్చారు. తన ఆట పాటతో అలరించారు. ఇక బిగ్ బాస్ ప్రాసెస్ లో భాగంగా మీరు ఎందుకు బిగ్ బాస్ కు రావాలని అనుకుంటున్నారు అని అడిగితె, ‘నా పాటతోటి ఈ సమాజాన్ని మార్చాలి.. పాటకి ఉన్న శక్తి ఇక్కడితో ఆగిపోకూడదు.. జనంలో చైతన్యం తీసుకుని రావాలి. నా పాట ప్రపంచానికి తెలియాలి.. దానికో ప్లాట్ ఫామ్ కావాలి.. అది బిగ్ బాస్ అయితే బావుంటుందని ఇక్కడికి వచ్చాను’ అని జవాబిచ్చారు నర్సయ్య. అంతా విన్న తరువాత మీరు బిగ్ బాస్ కి పనికిరారంటూ బిందు మాధవి రెడ్ చూపించేసింది. ఇక శ్రీముఖి ఇంకో ఛాన్స్ ఇద్దామని చెప్పి ఆయనను తాడుపై వేలాడుతూ పాట పాడమంది. పాపం నర్సయ్య అంత పెద్ద వయసులోనూ ఆ పని చేశారు. అంతా అయిన తరువాత.. మీరు బిగ్ బాస్ కు పనిరారని మళ్ళీ చెబుతూ నవదీప్, అభిజిత్ ఇద్దరూ రెడ్ చూపించేశారు. దీంతో నర్సయ్య తాత దిగాలుగా వెనక్కి వెళ్లిపోయారు.
Narsaiah Thatha: అసలు ఈ తతంగం చూస్తుంటే.. చాలా దారుణంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షో చూస్తున్న ప్రతి ఒక్కరూ నర్సయ్య తాత విషయంలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఆయన పనికి రారని అనుకున్నపుడు తాడుపై వేలాడాలనే టాస్క్ ఎందుకు ఇచ్చినట్టు? టాస్క్ విజయవంతంగా పూర్తి చేసిన తరువాత కూడా నర్సయ్య తాతను పనికిరావని అవమానించి వెనక్కి తిప్పడం బిగ్ బాస్ పైత్యానికి నిదర్శనంలా కనిపిస్తోందని అందరూ అంటున్నారు. నర్సయ్యతాతను రిజెక్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Narsaiah Thatha: ఇదిలా ఉంటె తనను రిజెక్ట్ చేసిన విషయంపై నర్సయ్య తాత ‘‘మనసుకి ముసుగేసే మాయ మాటల గుణముతోటి వాడితో నీకెందుకురా ఈ రణము. బిగ్ బాస్ షోలో నర్సయ్య తాతని ఆపేయడం అంటే ఓ శక్తిని ఆపేయడమే. వాళ్ల స్వార్థమా? ఓర్వలేని తనమా? అనేది జనమే తేల్చుతారు’ అంటూ స్పందించడం కొసమెరుపు.
