Lalitha Hospital: డాక్టర్ పివి రాఘవ శర్మ గుంటూరుకు ఆ ప్రాంతానికి పరిచయం చేయనవసంరం లేని పేరు 35 ఏళ్ళ నుండీ ప్రముఖ కార్డియాలజిస్ట్ గా గుంటూరు ప్రాంతానికి సుపరిచితులు. లలితా సూపర్ స్పెషాలిటీస్ శర్మ గారు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయి గుంటూరు మొత్తం ఎమ్మెల్యేలు , ఎంపీ కొత్త వారవటం ఇక్కడ డాక్టర్లు వ్యాపారస్తులు ప్రజల పరిస్థితి రోజుకో విధంగా తయారవుతుంది. విషయంలోకి వస్తె ఈ గొప్ప పేరున్న డాక్టర్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రి, మాజీ మంత్రుల చుట్టూ రోజూ తిరిగే పరిస్థితి వచ్చింది.
Lalitha Hospital: గుంటూరుకు చెందిన ఓ అనధికార ఎమ్మెల్యే చేతికి చిక్కడమే వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన కొరసాని రోషి రెడ్డి అనే రైతు 1943 లో కొరిటిపాడులో 4.00 ఎకరాలు భూమి కొనుకోలు చేసి రిజిస్ట్రేషన్ (Sale Deed: 461/1943) చేసుకొన్నారు, కాలానుగుణంగా దానిలో కొంత భాగం 2.00 ఎకరాలు శిరసపల్లి కృష్ణారావు అనే మరో రైతుకు అమ్మారు.
Lalitha Hospital: శిరసపల్లి కృష్ణారావు తన రెండు ఎకరాల భూమిని ప్లాటులుగా మార్చి అమ్ముకున్నారు, కొరసాని రోషి రెడ్డి తన మిగిలిన భూమిని దున్నుకొని వ్యవసాయం కొన్నాళ్ళు చేశారు కాల క్రమేణా తన ఆర్ధిక అవసరాలకు 379 గజాల భూమిని ఈ ప్రముఖ వైద్యులు రాఘవ శర్మకి అమ్మాడు రైతు కొరసాని రోషి రెడ్డి. ఇపుడు ఆ భూమిలో పైన చెప్పిన గుంటూరు అనధికార ఎమ్మెల్యే తన అనుచరుడు బెంగుళూరు శివను దింపాడు.
ఇది కూడా చదవండి: Gwalior: నడిరోడ్డుపై భార్యను కాల్చిచంపిన భర్త..వీడియో వైరల్!
Lalitha Hospital: నేరుగా కబ్జా చేసి తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఉండే ఓ కంటెయ్యినర్ ఆఫీసును తెప్పించి ఆ భూమిలో పెట్టించాడు డాక్టర్ పరిపరుగున ఆ అనధికార ఎమ్మెల్యే దగ్గరకు పోయి నా భూమి అంటూ ఆవేదన చెందారు అయితే దాన్ని 2022లోనే తాను కొన్నానని దాని పూర్వపు యజమానులు సాంబశివరావు , నాగరత్నంలని వారి దగ్గర తాను కొన్నానని చెప్పారు ఆ ఎమ్మెల్యే.
చేసేది లేక వాదన అనంతరం ప్రస్తుత రెవెన్యూ మంత్రిని, పల్నాడు జిల్లాలోని ఓ మాజీ మంత్రిని, ఓ సీనియర్ ఎమ్మెల్యేని తనకున్న చొరవతో కలసి విన్నవించుకొని ఆ గుంటూరు ఎమ్మెల్యేకు ఫోన్ చేయించాడు, దానితో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ఎమ్మెల్యే ఇంకెవరన్నా ఉన్నారా అంతా అయిపోయారా అంటూ డాక్టర్ గారికి నేరుగా కాల్ చేసి తన కోపాన్ని చూపించాడు.
ఇది కూడా చదవండి: High Court: భక్తుల రక్షణకు నడకదారిలో ఇనుప కంచె ఏర్పాటు చేయండి.. హైకోర్టు ఆదేశాలు
మీరు ఎవరు చెపితే విం చెపితే వారిని సంప్రదిస్తాను చెప్పమని అడిగాడు డాక్టర్, ఎవరు చెప్పినా వినేది లేదన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ ఎమ్మెల్యే ఎంత ప్రముఖులైనా ఆ ఎమ్మెల్యే దందాలకు రియల్ దందాలకు హడల్ ఇలాంటివి పదుల సంఖ్యలో వెలుగులోకి వచ్చినా అతన్ని కట్టడి చేయలేక పోవటానికి కారణాలు కూటమి ప్రభుత్వంలోని పెద్దలే చెప్పాలి.
రాజధాని వల్ల భూముల ధరలు పెరగటంతో ఆ ఎమ్మెల్యే వివాదం సృష్టించిన భూమి 4 నుండి 6 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా!! డాక్టర్ గారి ఆడిటర్ దగ్గరకు 50/50 అంటూ తన అనుచరుడు బెంగుళూరు శివను పంపించాడని కూడా వార్తలు వస్తున్నాయి వాస్తవాలు డాక్టర్ గారే చెప్పాలి.
