UPSC Govt Jobs 2025: దేశంలోని ప్రతిష్టాత్మక నియామక సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరోసారి అర్హులైన అభ్యర్థుల కోసం కొత్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనుంది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.
మొత్తం ఖాళీలు: 213
పోస్టుల వివరాలు:
- అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్: 05
- అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్: 16
- అడిషనల్ లీగల్ అడ్వైజర్: 02
- అసిస్టెంట్ గవర్నమెంట్ అడ్వకేట్: 01
- డిప్యూటీ గవర్నమెంట్ అడ్వకేట్: 02
- డిప్యూటీ లీగల్ అడ్వైజర్: 12
- లెక్చరర్ (ఉర్దూ): 15
- మెడికల్ ఆఫీసర్: 125
- అకౌంట్స్ ఆఫీసర్: 32
- అసిస్టెంట్ డైరెక్టర్: 03
ఇది కూడా చదవండి: Rahul Gandhi Arrest: ఢిల్లీలో హైటెన్షన్ – రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల అరెస్ట్
అర్హతలు:
- పోస్టు ఆధారంగా సంబంధిత విభాగంలో డిగ్రీ / లా డిగ్రీ / పీజీ (ఉర్దూ) / బీఈడీ / ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
- సంబంధిత రంగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- జనరల్ అభ్యర్థులకు: 50 ఏళ్లు
- ఓబీసీ అభ్యర్థులకు: 53 ఏళ్లు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు: 55 ఏళ్లు
- పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: 56 ఏళ్లు
- ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 40 ఏళ్లు
ఫీజు వివరాలు:
- జనరల్ అభ్యర్థులు: రూ.25
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు: ఫీజు మినహాయింపు
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 13, 2025, చివరి తేదీ: అక్టోబర్ 2, 2025
ఎంపిక విధానం రాత పరీక్ష లేకుండా విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి నోటిఫికేషన్ వివరాలు చెక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
