Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం అతను అవుట్!

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్స్ చుట్టూ ఆసక్తికర వాతావరణం నెలకొంది. హౌస్‌లో చిన్న చిన్న గొడవలు, భావోద్వేగ క్షణాలు కొనసాగుతూనే ఉన్నాయి. సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ “ఓనర్స్ – టెనెంట్స్” టాస్క్ పెట్టగా, రీతూ చౌదరి సంచలక్‌గా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో హౌస్‌మేట్స్ గట్టిగానే పోటీపడ్డారు.

Bigg Boss 9: ఈ వారం నామినేషన్స్‌లో మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా శెట్టి, డిమాన్ పవన్, భరణి కుమార్, ఫ్లోరా సైని ఉన్నారు. ఇప్పటికే హౌస్‌లో జరిగిన గొడవల్లో హరిత హరీష్ ప్రధానంగా నిలిచాడు. అయితే ప్రేక్షకుల ఓట్లు మాత్రం సుమన్ శెట్టి, భరణి వైపు మొగ్గు చూపుతున్నాయి. వీరిద్దరూ టాస్క్‌లలో బాగా పర్ఫామ్ చేస్తూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు.

ఇది కూడా చదవండి: Bigg Boss 9: “మీది గివ్-అప్ ఇచ్చే పర్సనాలిటీ”.. హరీష్‌పై చుక్కలు చూపించిన రీతూ చౌదరి!

అదే సమయంలో డిమాన్ పవన్ రెండో వారం కెప్టెన్‌గా నిలవడంతో అతని ఎలిమినేషన్ ఛాన్స్ లేకపోయింది. ఇక ఫ్లోరా, హరిత హరీష్ కూడా ప్రేక్షకుల ఓట్లు కొంతవరకు దక్కించుకున్నారు.

ఎలిమినేషన్ విషయంలో చివరి పోటీ ప్రియా శెట్టి, మర్యాద మనీష్ మధ్య జరిగింది. అయితే ప్రియకు కొన్ని ఓట్లు ఎక్కువగా రావడంతో ఆమె సేఫ్ అయింది. దీంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన కంటెస్టెంట్ మర్యాద మనీష్ అయ్యాడు.

ప్రేక్షకుల ఓట్లు ఈసారి మళ్లీ ఒక సర్ప్రైజ్ ఇస్తూ, బిగ్ బాస్ హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొల్పాయి. ఇక వచ్చే వారం ఎలిమినేషన్ కోసం ఎవరు నామినేట్ అవుతారనే ఉత్కంఠ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *