Bigg Boss 9: టాస్క్‌లో దుమ్ముదులిపిన భరణి..షోలో కొత్త హోదా!

Bigg Boss 9: రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 మొదటి వారం పూర్తి చేసుకుంది. నాగార్జున హోస్ట్‌గా ఈ సీజన్ గత ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి వారం ఎలిమినేషన్‌లో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయలుదేరింది. ఆటలో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఓటింగ్‌లో సరైన మద్దతు దక్కకపోవడం ఆమె ఎలిమినేషన్‌కు కారణమైంది.

Bigg Boss 9: ఇక ఆదివారం ఎపిసోడ్‌లో మిరాయ్ మూవీ టీమ్‌ – హీరో తేజ సజ్జ, హీరోయిన్ రితిక నాయక్ స్టేజ్ పై సందడి చేశారు. హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించి, డాన్స్ చేయించారు. తర్వాత నాగార్జున ఒక స్పెషల్ టాస్క్ ప్రకటించారు. టెనెంట్స్‌లో నుంచి ఒకరు పర్మినెంట్ ఓనర్‌గా మారే ఛాన్స్ ఇచ్చారు.

బిగ్‌బాస్‌ టాస్క్‌లో రెడ్ టీమ్‌లో భరణి, రాము రాథోడ్, శ్రష్టి వర్మ, తనూజ ఉండగా, బ్లూ టీమ్‌లో సంజన, ఇమ్మానుయేల్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి ఉన్నారు. మిగిలిన ఫ్లోరా షైనీను సంచలక్‌గా చేశారు. టాస్క్ ప్రకారం కన్వేయర్ బెల్ట్ నుంచి వచ్చే పేపర్స్‌పై స్టాంప్ వేసి బ్యాలెట్ బాక్స్‌లో వేసే ఆట సాగింది. ఒక టీమ్ మరొక టీమ్‌ను ఆపేందుకు ప్రయత్నించవచ్చు అని బిగ్‌బాస్ చెప్పడంతో హౌస్‌లో గందరగోళం నెలకొంది.

ఇది కూడా చదవండి: Bigg Boss 9: నాగ్ క్లాస్‌తో హౌస్ కుదిపేసిన ఎపిసోడ్.. శ్రష్ఠి వర్మ ఎలిమినేట్!

ఈ టాస్క్‌లో రెడ్ టీమ్ తరఫున భరణి అద్భుతంగా ఆడాడు. బ్లూ టీమ్ సభ్యులు రీతూ చౌదరి, ఇమ్మానుయేల్‌ను కదలకుండా అడ్డుకున్నాడు. ఇక బ్లూ టీమ్‌లోని సంజన చేసిన చిన్న తప్పు వారికి నష్టమైంది. ఆ ఛాన్స్‌ను రెడ్ టీమ్ వినియోగించుకుని విజయాన్ని సొంతం చేసుకుంది.

చివరగా, రెడ్ టీమ్ నుంచి ఎవరు ఓనర్ అవ్వాలి అన్నది బ్లూ టీమ్ ఇంకా సంచలక్ ఫ్లోరా నిర్ణయానికి వదిలారు. ఫ్లోరా శ్రష్టి వర్మ పేరు సూచించినా, బ్లూ టీమ్ సభ్యులు భరణికు మద్దతు ఇచ్చారు. దీంతో భరణి పర్మినెంట్ ఓనర్ అయ్యాడు. నాగార్జున అతనికి ఒక ప్రత్యేక పవర్ ఇచ్చి, అసిస్టెంట్‌గా ఒకరిని ఎంచుకోవాలని చెప్పారు. భరణి తనుజను అసిస్టెంట్‌గా ఎంపిక చేసుకున్నాడు.

మొత్తం మీద, టాస్క్‌లో దూకుడు చూపించిన భరణి, మొదటి వారంలోనే బిగ్‌బాస్ ఇంట్లో పర్మినెంట్ ఓనర్ హోదా దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *