EC Response: దేశ రాజకీయాల్లో మరోసారి ఓట్ల తొలగింపు వివాదం రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
EC Response: అయితే రాహుల్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి పూర్తిగా అర్ధరహితమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఈసీ, ఆన్లైన్లో ఓట్ల తొలగింపు అసాధ్యమని తేల్చిచెప్పింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలంద్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆ విషయాన్ని అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేశారని ఈసీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: AC Offers: వావ్.. రూపాయికే ఏసీ బుకింగ్! జీఎస్టీ తగ్గింపుతో సూపర్ డీల్స్ ప్రకటించిన కంపెనీలు!
రాహుల్ గాంధీ మాత్రం ఆరోపణలను మరింత బలపరుస్తూ, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను వాడుతున్నారని అన్నారు. సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపించారు. మహారాష్ట్ర రాజురాలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారని, కర్ణాటక అలంద్లో ఒకే పేరుతో 18 ఓట్లు తొలగించారని ఆయన ఉదాహరణలు ఇచ్చారు.
అంతేకాక, కర్ణాటక సీఐడీ 18 సార్లు ఆధారాలు అడిగినా ఈసీ వాటిని ఇవ్వలేదని రాహుల్ మండిపడ్డారు. వారంలోగా సాక్ష్యాలను సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాహుల్ ఆరోపణలపై బీజేపీ కూడా తీవ్రంగా స్పందించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, “హైడ్రోజన్ బాంబు పేలుస్తానన్న రాహుల్ గాంధీ డ్రామా మాత్రమే చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఈసీ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై ఆరోపణలు చేయడం తప్పు” అని విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలపై రాహుల్కు నిజంగా ఆధారాలు ఉంటే వాటిని కోర్టులో సమర్పించాల్సిందిగా సూచించారు.
