Shikhar Dhawan: బెట్టింగ్ యాప్ కేసులో శిఖర్ ధావన్‌కి ఈడీ సమన్లు

Shikhar Dhawan: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కష్టాలు పెరిగాయి. అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనకు సమన్లు జారీ చేసింది. ఇటీవల ఇదే కేసులో సురేష్ రైనా, హర్భజన్ సింగ్‌లను ఇప్పటికే ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Shikhar Dhawan: నివేదికల ప్రకారం, ధావన్ తన సోషల్ మీడియాలో 1xBet అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. ఈ విషయంలో తన పాత్రపై స్పష్టత ఇవ్వాలని ఈడీ ఆయనను విచారణకు పిలిచింది.

గత ఏడాది నుంచే బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటులు, క్రికెటర్లు ఈడీ దర్యాప్తులో ఉన్నారు. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, ఊర్వశి రౌతేలా, హర్భజన్ సింగ్, సురేష్ రైనా ఉన్నారు. ఇప్పుడు శిఖర్ ధావన్ పేరు కూడా చేరింది.

ఇది కూడా చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో ఢీ కొట్టే భారత జట్టు ఇదే..10 మందికి లక్కీ ఛాన్స్!

ఈ కేసులో కీలక నిందితుడిగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రపై ఈడీ ఆరోపణలు చేసింది. ఆయన తన సహచరులతో కలిసి దుబాయ్‌లో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లను నడిపారని, రూ. 2,000 కోట్లకు పైగా సంపాదించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. నిధులను సేకరించడానికి, అవి నిజమైన ఇ-కామర్స్ వ్యాపారాలుగా మారుస్తూ దాచిపెట్టారని కూడా పేర్కొన్నారు.

ఆగస్టులో వీరేంద్రను ఈడీ అరెస్టు చేసి కస్టడీలో ఉంచింది. అదే కేసులో ఇప్పుడు క్రికెటర్లు, సినీ ప్రముఖుల ప్రమోషన్లపై కూడా ఈడీ దృష్టి సారిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ పై నిషేధం అమలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *