Traffic Jam: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నప్పుడు ప్రజలు గంటల తరబడి ఇరుక్కుపోతారు. కానీ హర్యానాలో ఓ వ్యక్తి మాత్రం అందరినీ షాక్కు గురిచేశాడు. తన స్కూటీని భుజంపై వేసుకుని ట్రాఫిక్ మధ్యలో నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యం చూసిన వారంతా అతనిని నిజంగానే “బాహుబలి బ్రదర్” అని పిలుస్తున్నారు.
Traffic Jam: ఈ వీడియోలో రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు కనిపిస్తుంది. కార్లు, బైకులు కదల్లేకపోతున్నాయి. ఈలోగా ఇద్దరు యువకులు తమ స్కూటీని భుజాలపై వేసుకుని ట్రాఫిక్ను దాటుకుంటూ నడిచారు. 12 సెకన్ల ఈ వీడియోలో వారి నిర్ణయం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఇది కూడా చదవండి: Bus Accident: స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. బలి అయిన చిన్నారి!
వీడియోలో కనిపించిన నెంబర్ ప్లేట్ల ఆధారంగా ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకున్నదని భావిస్తున్నారు. అక్కడ తరచుగా ట్రాఫిక్ జామ్లు జరుగుతాయి. కానీ ఈసారి ట్రాఫిక్ కష్టాలపై కాకుండా, ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు స్కూటీని భుజంపై మోసుకున్న ఈ యువకులపైనే అందరి దృష్టి పడింది.
ఈ వీడియోను gurgaon_locals అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. వేలాది మంది ఇప్పటికే దీన్ని వీక్షించారు. కామెంట్ల విభాగంలో నెటిజన్లు ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు.
View this post on Instagram
“ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడటానికి ఇదో అద్భుతమైన పద్ధతి” అని ఒకరు రాశారు.“ఇలానే వెళ్తారు కానీ తర్వాత మసాజ్ తప్పదు” అని మరొకరు కామెంట్ చేశారు.ఇంకొకరు “హబీబీ, గుర్గావ్కి స్వాగతం” అంటూ సరదాగా రాసేశారు.
