Alcohol Teaser: అల్లరోడి ఆల్కహాల్ గోల!

Alcohol Teaser: ”లక్షలు లక్షలు సంపాదిస్తావ్.. మందు తాగవ్.. ఇంకెందుకురా నీకు ఈ బతుకు”  అంటూ సత్య హాయిగా ఉన్న అల్లరి నరేష్ ను చెడగొట్టేసినట్టు కనిపిస్తోంది. అవును.. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆల్కహాల్’.  ఈ మూవీకి సంబంధించిన టీజర్ వదిలారు మేకర్స్. అందులో సత్య.. అల్లరి నరేష్ ను ఇలా అనడం కనిపిస్తోంది. ఇక టీజర్ మొత్తం ఆల్కహాల్ చుట్టూనే తిరుగుతూ కనిపిస్తోంది. అల్లరోడు ఆల్కహాల్ తో గోల గోల చేస్తున్నాడు. మొత్తం మీద డార్క్ కామెడీగా ఈ మూవీ ఉండేటట్టు టీజర్ చూస్తే అనిపిస్తోంది. టీజర్ మాత్రం సినిమా మీద క్యూరియాసిటీని పెంచేసింది. జనవరి1, 2026లో విడుదల కానున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Pawan Kalyan: ‘ఓజీ’ సంచలనం అమెరికాలో రికార్డులు బద్దలు కొడుతున్న పవన్ కళ్యాణ్!

Alcohol Teaser: ఇక ఈ మూవీలో రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. నిహారిక ఎన్ఎమ్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెహర్‌ తేజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘు బాబు లాంటి నటులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *