Anushka: బాబోయ్.. అనుష్క! ఇదెక్కడి అరాచకం..

Anushka: హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ ఎడ్రస్ అంటే అనుష్క మొదటగా గుర్తుకు వస్తుంది. బాహుబలి, అరుంధతి, వేదం, మిర్చి, రుద్రమదేవి ఈ మూవీస్ లో అనుష్క చేసిన మేజిక్ ఎవరూ మర్చిపోలేరు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క తాజాగా ఘాటి సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డార్లింగ్ ప్రభాస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఘాటి మూవీ రేపు అంటే సెప్టెంబర్ 5న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఇప్పటికే విపరీతమైన హైప్ పెంచేసింది. 

Anushka: అనుష్క చాలా వైల్డ్ గా కనిపిస్తున్న దృశ్యాలు.. ట్రైలర్లు మూవీపై ఇంట్రస్ట్ ను పెంచేస్తే.. సెన్సార్ టాక్ కూడా ఘాటి మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉందనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ చాలాబాగా చేసినా.. అనుష్క మాత్రం ఎక్కడా బయటకు రాలేదు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే అనుష్క ప్రచారం చేస్తూ వస్తోంది. సినిమా  రిలీజ్ కు సరిగ్గా 24 గంటల ముందు డార్లింగ్  ప్రభాస్ రంగంలోకి దిగారు. మూవీ కోసం ప్రత్యేకంగా గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. 

ఇది కూడా చదవండి: Alcohol Teaser: అల్లరోడి ఆల్కహాల్ గోల!

ఇప్పటికే ఘాటి మూవీ పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను మరింత పెంచేసింది ఈ గ్లిమ్ప్స్. 1.21 నిమిషాల నిడివితో ఉన్న ఈ రిలీజ్ గ్లింప్స్‌లో అనుష్క వేరే లెవెల్ లో ఊచకోత చూపించారు. వాళ్ళు ఊరుకోరు.. వీళ్ళు ఊరుకోరు.. అంటే నేను ఊరుకోను అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో మూవీలో తన పాత్ర ఎలా ఉండబోతోందో అర్ధం అయిపొయింది. కత్తి, కర్ర ఏదైనా సరే అనుష్క చేతిలో పడితే ఆ అరాచకం వేరే లెవెల్ లో ఉంటుంది. గత సినిమాల్లో అది చూశాం. వాటిని మించి ఈ మూవీలో అనుష్క యాక్షన్ పార్ట్ ఉండేలా కనిపిస్తోంది.

మొత్తమ్మీద ఒక్కరోజు ముందు కూడా సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గలేదు.. అనుష్క ను ఎక్కడా తగ్గనీయలేదు. మరి ఆ రేంజిలో మూవీ ఉంటుందో లేదో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఓపిక పట్టాలి. అంతదాకా ఆగలేమంటే.. ఇదిగో ఇక్కడ టీజర్ ఉంది ఓ లుక్కేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *