Pathum Nissanka: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన గ్రౌండ్ క్లీనర్ కొడుకు!

Pathum Nissanka: ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో భారత్‌తో తలపడిన శ్రీలంక యువ క్రికెటర్‌ పతుమ్ నిస్సాంక అద్భుతమైన ఆటతీరు కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం సెంచరీ చేయడమే కాకుండా, ఒకే మ్యాచ్‌లో మూడు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. పేదరికం నడుమ పెరిగిన నిస్సాంక జీవితం, అతని విజయ గాధ క్రికెట్ అభిమానులకు స్ఫూర్తినిస్తోంది.

Pathum Nissanka: పతుమ్ నిస్సాంక తండ్రి వృత్తిరీత్యా గ్రౌండ్ బాయ్ (మైదానాన్ని శుభ్రం చేసే ఉద్యోగి). తల్లి గుడి బయట పూలు అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఇంతటి పేదరికంలో పెరిగిన నిస్సాంక, క్రీడాపై ఉన్న పట్టుదలతో, నిబద్ధతతో కష్టాలను అధిగమించి శ్రీలంక క్రికెట్‌లో స్టార్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఇది కూడా చదవండి: IPS Transfers: హైదరాబాద్‌ సీపీగా సజ్జనార్.. తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు!

భారత్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో నిస్సాంక 58 బంతుల్లో 107 పరుగులు చేశాడు. 184.48 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో అతను మూడు రికార్డులు సృష్టించాడు. ఆసియా కప్ 2025లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అలాగే శ్రీలంక తరపున మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీలు చేసిన నాల్గవ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాక, ఓడిన జట్టు తరపున కూడా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఇదే కాకుండా, నిస్సాంక విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించాడు. ఇప్పటివరకు T20 ఆసియా కప్‌లో కోహ్లీ 429 పరుగులు సాధించగా, తాజా సెంచరీతో నిస్సాంక మొత్తం 434 పరుగులు చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. 12 మ్యాచ్‌లలో 12 ఇన్నింగ్స్‌ల్లో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి.

T20 ఆసియా కప్ చరిత్రలో సెంచరీ చేసిన మూడవ ఆటగాడిగా కూడా నిస్సాంక గుర్తింపు పొందాడు. అతని ముందు భారత్‌కు చెందిన విరాట్ కోహ్లీ, హాంకాంగ్‌కు చెందిన బాబర్ హయత్ మాత్రమే ఈ ఘనత సాధించారు. పేదరికం నుండి ఎదిగిన నిస్సాంక ఈ విజయాలతో అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త చరిత్రను సృష్టిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *