Arattai App: భారతదేశం నుంచి ఓ కొత్త మెసేజింగ్ యాప్ వచ్చినట్టు వార్త. Arattai అనే ఈ యాప్ ను చెన్నై కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ Zoho Corporation రూపొందించింది. ఈ యాప్ ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్లో సోషల్ నెట్వర్కింగ్ విభాగంలో నంబర్ 1 ట్రెండ్లో ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఈ యాప్ను ప్రోత్సహించారు.
Arattai App: Arattai యాప్లో యూజర్ల ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. యూజర్ డేటా పూర్తిగా భారతదేశంలోనే సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కాల్స్ కోసం అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మెసేజులకు కూడా ఎన్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి : Doctor suicide: ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు వేధింపుల కారణంగా ఆత్మహత్య..!
ఫీచర్స్
- వాట్సాప్ లాగే టెక్స్ట్ మెసేజులు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ షేర్ చేయగలరు.
- వాయిస్ & వీడియో కాల్స్ స్పష్టమైన క్వాలిటీతో చేయవచ్చు.
- వార్తలు, ఇతర సమాచారం కోసం చానెల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
- ఇండియాలోని అన్ని లోకల్ లాంగ్వేజెస్లో యాప్ ఉపయోగించవచ్చు.
- యాప్ ఇంటర్ఫేస్ కూడా వాట్సాప్ను పోలి ఉంటుంది.
- తక్కువ కాలంలోనే Arattai, వాట్సాప్ కు ప్రత్యామ్యంగా మారేలా మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.
Arattai App స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా, వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా భారత యూజర్లకు ప్రత్యేకమైన ఫీచర్స్ అలానే ఎన్క్రిప్షన్ సౌలభ్యంని అందిస్తోంది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే సందర్భంలో, ఈ యాప్ మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉంది.
