Bigg Boss Captaincy: కెప్టెన్సీ కంటెండర్స్‌గా కళ్యాణ్, ఇమ్మానుయేల్ – కొత్త టీమ్‌లతో టాస్క్ ప్రారంభం!

Bigg Boss Captaincy: బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ రేస్‌ మరింత హాట్ టాపిక్‌గా మారింది. తాజా టాస్క్‌లో టీమ్ విజయం సాధించి కంటెండర్‌షిప్ కార్డ్ పొందింది. ఆ కార్డును కళ్యాణ్, ఇమ్మానుయేల్‌కు ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరూ కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఎంపికయ్యారు.

Bigg Boss Captaincy: ఈ పరిణామంపై హౌస్‌లో చర్చలు మరింత రగిలాయి. రీతూ-డీమాన్ కలిసి సుమన్ శెట్టి, సంజన గేమ్ గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. “మా టీమ్ ఆడాలా లేదా అన్నది డిసైడ్ చేయడమేంటి.. నోటిలో నోరు పెట్టలేను నేను.. అసలు పెట్టను” అని సుమన్ శెట్టి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి: Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9: గరం గరం నామినేషన్స్.. రచ్చ రచ్చ చేసిన హౌస్‌మేట్స్!

పవన్ మాట్లాడుతూ “బయటకి వచ్చి ఇచ్చిపడేయ్ అన్నా” అని అంటే, సుమన్ వెంటనే స్పందిస్తూ –
“ఏం ఇచ్చేమంటావ్? వాళ్ళలాగా కుక్కల్లా అరవమంటారా? అలా అరిచినా న్యాయం, నీతి, నిజాయతీగా ఉండాలి. ఊరుకునే అరిస్తే వచ్చే ప్రయోజనం ఏముంటుంది?” అంటూ హౌస్ అంతా కుదిపేశాడు.

తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తూ –
“కళ్యాణ్, ఇమ్మానుయేల్ మీరు కంటెండర్స్‌గా అర్హత సాధించారు. ఇక మీతో పాటు మరికొందరు కంటెండర్స్ ఎవరో తెలుసుకోవడానికి మీరు ఇంటి సభ్యుల్లో ఆరుగురిని సెలక్ట్ చేసి, మూడు టీమ్‌లుగా డివైడ్ చేయాలి. ఈ టీమ్స్ మరో ఛాలెంజ్‌లో పోటీ పడతాయి” అని తెలిపారు.

ఈ క్రమంలో ఇమ్మానుయేల్, కళ్యాణ్ మధ్య చర్చ జరిగింది. డీమాన్‌ను పక్కన పెట్టాలని కళ్యాణ్ సూచించడంతో, వారు చివరికి ఈ విధంగా టీమ్‌లు చేశారు:

  • తనూజ – సుమన్

  • ఫ్లోరా – రీతూ

  • సంజన – రాము

అయితే, హరీష్ గాయంతో టాస్క్ ఆడలేనని ప్రకటించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ మరో కొత్త టాస్క్‌ను అనౌన్స్ చేసి గేమ్‌లో ఉత్కంఠను పెంచాడు.

బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కోసం ఎవరి గేమ్ ప్లాన్ స్ట్రాంగ్‌గా పని చేస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *