Bigg Boss 9: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారం పూర్తి చేసుకుంది. హోస్ట్ నాగార్జున స్టైల్లో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సీజన్లో తొలివారమే ఎలిమినేషన్ జరగడం హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కే కాదు, ప్రేక్షకులకూ షాక్ ఇచ్చింది.
Bigg Boss 9: మొదటి వారం నామినేషన్స్‌లో శ్రష్టి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్ ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ చివరగా నాగార్జున శ్రష్టి వర్మను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.
కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రష్టి, బిగ్ బాస్ హౌస్‌లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడంతో ప్రేక్షకుల మద్దతు దక్కలేదు. దాంతో తొలివారమే ఆమె ఆట ఆగిపోయింది.
ఇది కూడా చదవండి: Mega DSC 2025: తుది జాబితా విడుదల.. ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఇక్కడ చెక్ చేసుకోండి
తొలివారమే ఔట్ అయినప్పటికీ శ్రష్టి వర్మకు భారీ రెమ్యునరేషన్ లభించిందని వార్తలు వస్తున్నాయి. వారం రోజులు హౌస్‌లో ఉన్నందుకు ఆమెకు దాదాపు రూ.2 లక్షలు చెల్లించారని సమాచారం. దీంతో కేవలం ఏడు రోజుల్లోనే శ్రష్టి మంచి మొత్తాన్ని సంపాదించింది.
హౌస్ నుంచి బయటకు వస్తూ శ్రష్టి, బిగ్ బాస్ రూల్స్ ప్రకారం బిగ్ బాంబ్ వేసింది. హౌస్‌లో నిజాయితీగా ఉన్నవారిలో మనీశ్, హరీశ్, రాము రాథోడ్, ఆషా షైనీ పేర్లు చెప్పింది. ఇక కెమెరా ముందు యాక్టింగ్ చేసే కంటెస్టెంట్స్‌గా భరణి, రీతూ చౌదరి, తనూజ పేర్లు బయట పెట్టింది.
బిగ్ బాస్ 9 మొదటి వారంలోనే శ్రష్టి వర్మ ఎలిమినేషన్ షాకింగ్‌గా అనిపించినా, ఆమె రెమ్యునరేషన్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఇక వచ్చే వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
View this post on Instagram
