Bigg Boss9 Telugu: బిగ్ బాస్ వచ్చేస్తోంది.. మరి హౌస్ లోకి వెళ్ళేవారెవరో తెలుసా? ఇదిగో లిస్ట్.. 

Bigg Boss9 Telugu: మన పంచెకు నిప్పు అంటుకున్నా పెద్దగా పట్టించుకోము. కానీ, పక్కోడి కొంపలో ఏమవుతుందా అనేది మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చెవులు, కళ్ళు అటేపు వేసేస్తాము. ఈ మాటలు కొంచెం కష్టంగా అనిపించినా నిజం మాత్రం అదే. ఇదిగో సరిగ్గా మనిషిలో ఉండే  ఈ బలహీనతను ఆధారంగా చేసుకుని వచ్చిందే బిగ్ బాస్ షో. ప్రతి సీజన్ ప్రారంభంలోనూ ఇదో పనికిమాలిన షో. పనిలేని వాళ్ళు చూసే షో. బిగ్ బాస్ హౌస్ లో అంతా అవకతవకలే.. అసలు దీనిని బ్యాన్ చేసి పారేయాలి.. ఇలాంటి వ్యాఖ్యలు విపరీతంగా వస్తాయి. అయినా కానీ, బిగ్ బాస్ (Bigg Boss9 Telugu) వచ్చే టైముకి అందరూ టీవీలు, మొబైల్ ల ముందు అతుక్కుపోతారు. అది సహజమైన బలహీనత. అదేకదా బిగ్ బాస్ అంటే. కొంతమంది మంది ఆడా, మగా.. ఒక ఇంట్లో వందరోజుల పాటు ఉంటే.. వారి మధ్య జరిగే పిచ్చ కహానీలు చూడటం అంటే ఎంత విమర్శలు చేసేవారికైనా అదో సరదా. అందుకే బిగ్ బాస్ కొత్త సీజన్ వస్తోందంటే అందరికీ ఆసక్తి. ఈసారి ఎవరు హౌస్ లోకి వెళతారు? హోస్ట్ గా నాగార్జున వస్తారా? మారుతున్నారా? హౌస్ ఎలా ఉంటుంది? ఇలాంటి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదిగో తెలుగులో బిగ్ బాస్ 9వ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హంగామా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఉంది. 

ఇక ఈసారి బిగ్ బాస్(Bigg Boss9 Telugu) లో 16 మంది ఉంటారని చెబుతున్నారు. వారిలో ఐదుగురిని అగ్నిపరీక్ష అనే ఓ ప్రహసన కార్యక్రమం పెట్టి సెలెక్ట్ చేస్తున్నారు. అది చివరి దశలోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో హంగామా చేసే ఆర్టిస్టులు.. బిగ్ బాస్ లోకి వెళ్లాలని అనుకునే సామాన్యులు ఇలా ఓ పదిహేను మందిని సెలెక్ట్ చేసి వారికీ బిగ్ బాస్ మార్క్ పిచ్చి టెస్టులు పెట్టి.. వాళ్ళ నుంచి ఐదుగురిని హౌస్ లోకి పంపించబోతున్నారు. వీరు కాకుండా ఓ 11 మంది సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంటే మొత్తం 16మంది బిగ్ బాస్ లోకి వెళతారు. ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ ప్రారంభం కాబోతోంది. అక్కడి నుంచి వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌస్(Bigg Boss9 Telugu) లో ఈ సెలబ్రిటీల మధ్య జరిగే రచ్చతో టీవీలు.. సోషల్ మీడియా మోగిపోతుంది. మరి ఎవరెవరు బిగ్ బాస్ లోకి వెళ్ళబోతున్నారు? ముందుగానే తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నవారికి ఇక్కడ ఒక లీకైన లిస్ట్ ఉంది. దాదాపుగా ఈ లిస్టులో ఉన్నవారే బిగ్ బాస్ హౌస్ లోకి ఆదివారం ఎంట్రీ ఇస్తారు. మరి ఆ లీకైన లిస్ట్ ఏమిటో చూసేయండి. 

Bigg Boss9 Telugu: అగ్నిపరీక్ష ద్వారా వెళ్లేవారు వీరే అని అనుకుంటున్నారు.. 

మాస్క్‌ మెన్ హరీష్

శ్రీజా

ప్రియా శెట్టి 

పవన్ డెమాన్

నాగ ప్రశాంత్ లేదా అనూష 

Bigg Boss9 Telugu: ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే లీకైన లిస్ట్ ప్రకారం.. 

కమెడియన్ ఇమ్మానుయేల్ (జబర్దస్త్ ఫేమ్)

కమెడియన్ సుమన్ శెట్టి (7/G బృందావనకాలనీ)

అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య (చిట్టి పికెల్స్ ఫేమ్)

సీరియల్ నటుడు భరణి శంకర్ (స్రవంతి సీరియల్ ఫేమ్)

హీరోయిన్ ఆశాషైనీ (నరసింహనాయుడు ఫేమ్)

సీరియల్ నటి తనూజా గౌడ (ముద్దమందారం ఫేమ్)

ఫోక్ సింగర్ రాము రాథోడ్ (రాను బొంబాయి రానూ సాంగ్ ఫేమ్)

హీరోయిన్ సంజనా గల్రానీ (బుజ్జిగాడు మూవీ ఫేమ్)

కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ (జానీ మాస్టర్ అసిస్టెంట్)

యాక్టర్ హర్షిత్ రెడ్డి (శుభం, కల్కీ ఫేమ్)

జుబేదా సుల్తానా (కమెడియన్ అలీ వైఫ్)

అదండీ విషయం. లీకైన లిస్టులో ఉన్న వారే వెళతారో.. మరి ఇందులో మార్పులు ఏమైనా ఉంటాయో ఆదివారం దాకా ఆగితే తెలుస్తుంది. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *