RBI New Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరణించిన కస్టమర్ల బ్యాంకు ఖాతాలు, లాకర్లపై క్లెయిమ్‌లను సులభతరం చేసే కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. నామినీలు లేదా చట్టబద్ధ వారసులు క్లెయిమ్ దాఖలు చేయడం సులభం కావడానికి ప్రామాణిక ఫారమ్‌లు అన్ని బ్యాంకు శాఖలలో, వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. ఈ ఫారమ్‌లతో పాటు అవసరమైన పత్రాల జాబితా, క్లెయిమ్ పరిష్కారం కోసం దశలవారీ విధానం కూడా ఇవ్వబడుతుంది.
RBI New Rules: డిపాజిట్ ఖాతా లేదా లాకర్లో నామినీ ఉంటే, వారు కేవలం క్లెయిమ్ ఫారమ్, మరణ ధృవీకరణ పత్రం, తమ గుర్తింపు మరియు చిరునామా రుజువును సమర్పిస్తే సరిపోతుంది. నామినీ లేని సందర్భాల్లో, చట్టపరమైన వారసులకు అసౌకర్యం కలగకుండా బ్యాంకులు సరళీకృత విధానాన్ని అనుసరించాలి. కనీసం రూ.15 లక్షల వరకు క్లెయిమ్‌లకు ఇండెమ్నిటీ బాండ్ ఇంకా ఇతర వారసుల నుండి నో-అబ్జెక్షన్ లెటర్ సరిపోతుంది. అధిక మొత్తాల కోసం వారసత్వ ధృవీకరణ పత్రం లేదా చట్టపరమైన వారసుడి ధృవీకరణ పత్రం అవసరం.
ఇది కూడా చదవండి: Viral Post: అక్క అది పులి అనుకున్నావా పిల్లి అనుకున్నావా..వైరల్ పోస్ట్!
RBI New Rules: క్లెయిమ్ పరిష్కారం కోసం RBI స్పష్టమైన టైమ్‌లైన్‌ను కూడా నిర్దేశించింది. అవసరమైన అన్ని పత్రాలు అందిన 15 క్యాలెండర్ రోజులలోపు బ్యాంకులు ప్రక్రియను పూర్తి చేయాలి. లాకర్లు లేదా సేఫ్ కస్టడీలో వస్తువులు ఉన్నట్లయితే, 15 రోజుల్లోపు వాటిని తీసుకునే తేదీని కస్టమర్‌కు తెలియజేయాలి.
RBI New Rules: బ్యాంకుల తప్పిదం వల్ల ఆలస్యం జరిగితే, RBI బ్యాంకులపై పరిహారం చెల్లించే బాధ్యతను మోపింది. డిపాజిట్ సంబంధిత క్లెయిమ్‌ల విషయంలో ఆలస్యానికి ప్రస్తుత బ్యాంక్ రేటు కంటే తక్కువ కాకుండా వార్షిక 4% అదనపు వడ్డీ చెల్లించాలి. లాకర్లు లేదా సేఫ్ కస్టడీ వస్తువుల విషయంలో ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.5,000 పరిహారం ఇవ్వాలి.
