Jio Plan: దేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో, అందరికీ తక్కువ ధరకే వేగవంతమైన డేటా అందించడమే ప్రధాన లక్ష్యంగా జియో ముందడుగు వేస్తోంది. తాజాగా జియో తీసుకువచ్చిన రూ.51 స్పెషల్ డేటా వౌచర్, 5G నెట్‌వర్క్‌ను వినియోగించే కస్టమర్లకు నిజమైన వరం కావొచ్చునని అంటున్నారు నిపుణులు.
రూ.51 ప్లాన్‌తో ఏం లాభాలు?
Jio Plan: ఈ ప్లాన్ కేవలం రూ.51 చెల్లించగానే వినియోగదారులకు 3GB 4G డేటాతో పాటు అపరిమిత 5G డేటా లభిస్తుంది. ఇది చెల్లుబాటు కావడం మాత్రం రోజువారీ 1.5GB డేటా ప్లాన్ ఉన్న యాక్టివ్ జియో ప్లాన్లకే. అంటే మీరు ఇప్పటికే 1.5GB/day ప్లాన్ ఉపయోగిస్తుంటే, దీనితో కలిపి రూ.51 ప్లాన్‌ను యాక్టివేట్ చేస్తే నెలంతా మీరు అపరిమితంగా 5G డేటాను వినియోగించవచ్చు.
ఇది కూడా చదవండి: Accident: గుంతల రోడ్డు – చిన్నారుల ప్రాణాలకు ముప్పు!
అదనపు ఎంపికలు: రూ.101 & రూ.151 ప్లాన్లు
- రూ.101 ప్లాన్: 6GB హైస్పీడ్ డేటా + అపరిమిత 5G. ఇది 1GB/Day లేదా 1.5GB/Day ప్లాన్లకు వర్తిస్తుంది. చెల్లుబాటు వ్యవధి: 2 నెలలు.
- రూ.151 ప్లాన్: 9GB హైస్పీడ్ డేటా + అపరిమిత 5G. ఇదికూడా రోజువారీ 1.5GB ప్లాన్‌తో 2 నెలలు చెల్లుబాటుగా ఉంటుంది.
Jio Plan: ఈ రెండు ప్లాన్‌ల్లో కూడా హైస్పీడ్ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గిపోతుంది. అయినప్పటికీ 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాన్లు మరింత ఉపయోగకరంగా మారుతాయి.
రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్ – హై బెనిఫిట్స్‌తో
Jio Plan: జియో గత నెలలో ప్రవేశపెట్టిన రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, 100 SMSలు, అపరిమిత 5G డేటా, జియోTV, జియోAICloud వంటి అదనపు ప్రయోజనాలున్నాయి. దీని వ్యాలిడిటీ 14 రోజులు మాత్రమే.
ఎందుకు ప్రత్యేకం ఈ ప్లాన్లు?
Jio Plan: జియో 5G కవర్డ్ ప్రాంతాల్లో నివసించే వినియోగదారులకు వీటిలోని ప్రతి ప్లాన్ స్మార్ట్‌ఫోన్ వినియోగంలో విప్లవాత్మక మార్పు తేవచ్చు. విద్యార్థులు, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు, ఆన్లైన్ స్ట్రీమింగ్ యూజర్లకు వీటి వలన అత్యుత్తమ నెట్వర్క్ అనుభవం లభించనుంది.
