Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ షాక్‌ 50 కంపెనీలపై దాడులు, మనీలాండరింగ్ ఆరోపణలు తాలూకు ప్రకంపనలు

Anil Ambani

Anil Ambani: బిజినెస్ ప్రపంచంలో ఓ వెలుగు అయిన అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థలపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించారు. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్న 35 లోకేషన్లపై, 50కి పైగా సంస్థలపై, అలాగే 25 మంది వ్యక్తుల నివాసాలపై ఈడీ తనిఖీలు చేసింది.

Anil Ambani: ఈ దాడులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 17 కింద జరిపినట్టు ఈడీ వెల్లడించింది. 2017 నుంచి 2019 మధ్య యస్‌ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలు వేరే మార్గాల్లో మళ్లించబడ్డాయన్న ఆరోపణలతో ఈ విచారణ మొదలైంది. సీబీఐ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్‌లు, అలాగే సెబీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీలు అందించిన సమాచారంపై ఆధారపడి ఈడీ తన చర్యలు చేపట్టింది.

Anil Ambani: ఈడీ ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థికంగా బలహీనమైన సంస్థలకు పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడం, తగిన డాక్యుమెంటేషన్ లేకపోవడం, ఒకే చిరునామాతో ఉన్న బహుళ సంస్థలు, షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు, రుణాలను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తూ మూలం చెల్లించకుండా ఎవెర్గ్రీనింగ్ చేయడం వంటి అక్రమాలు బయటపడ్డాయి.

ఇది కూడా చదవండి: Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్‌తో ప్రజల్లో ఆందోళన!

Anil Ambani: ఇక ప్రత్యేకంగా 2018లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కి సంబంధించిన రుణాలు రూ.3,742 కోట్లుగా ఉండగా, ఒక్క సంవత్సరం వ్యవధిలో 2019 నాటికి రూ.8,670 కోట్లకు పెరగడం విచారణలో కీలక అంశంగా మారింది. ఈ మధ్యలో యస్ బ్యాంక్ ప్రమోటర్ల ఖాతాలకు భారీ మొత్తంలో నిధులు బదిలీ అయినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇది quid pro quo ఒప్పందంగా జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాలు రిలయన్స్ గ్రూప్‌పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తలెత్తిన ఆరోపణలపై మరింత లోతైన విచారణకు రంగం సిద్ధమవుతోంది. అనిల్ అంబానీ స్థితిగతులపై ఈ విచారణ కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *