Crime News: తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ముగ్ధుంపూర్ గ్రామంలో ఓ యువకుడి హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన ఈ కేసులో బ్లాక్మెయిల్, బెదిరింపు, పరువు అనే మూడు అంశాలు అత్యంత విషాదకర ముగింపుకు దారి తీశాయి.
Crime News: హైదరాబాద్ బోరబండకు చెందిన మహ్మద్ సాబిల్ (21) అనే యువకుడు ముగ్ధుంపూర్ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆమెను తనకు పెళ్లి చేసి పెట్టాలని కోరిన సాబిల్కు యువతి కుటుంబం తేల్చి చెప్పింది — ‘‘పెళ్లి చేయలేము.’’ కానీ ఇది సాబిల్కు నచ్చలేదు. తన ప్రేమను బలవంతంగా ఒప్పించేందుకు యువతి నగ్న ఫోటోలను బయటపెడతానంటూ ఆమె సోదరుడిని బెదిరించడం మొదలుపెట్టాడు.
అతని బెదిరింపులకు భయపడిన కుటుంబ సభ్యులు ఫోటోలు డిలీట్ చేయమని పలుమార్లు వేడుకున్నప్పటికీ సాబిల్ ఒప్పుకోలేదు. అంతటితో ఆగకుండా, యువతి అన్న సయ్యద్ అప్సర్ను కూడా వేధించడం మొదలుపెట్టాడు. ఇక పరిస్థితిని తట్టుకోలేక, అప్సర్ తన స్నేహితుడు సంతోష్తో కలిసి ఓ ప్రణాళిక రచించాడు.
ఇది కూడా చదవండి: HHVM First Day Collections: బాక్సాఫీస్ను షేక్ చేసిన పవన్..హరిహర వీరమల్లు ఫస్డ్ డే కలెక్షన్ల డిటేల్స్ ఇవే!
Crime News: అప్సర్ పథకం ప్రకారం సాబిల్ను మాట్లాడదామని ఓ ప్రదేశానికి పిలిపించాడు. కారులో ఎక్కించి, ముగ్ధుంపూర్ శివారులోకి తీసుకెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. కోపావేశంలో సాబిల్ తలపై బండరాయితో దెబ్బతీయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి అప్సర్, సంతోష్ ఇద్దరూ పరారయ్యారు.
పక్కనున్న ప్రజలు శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొద్దిసేపటికే నిందితులైన అప్సర్, సంతోష్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన ప్రేమ పేరుతో జరుగుతున్న బ్లాక్మెయిల్, మానసిక వేధింపుల తీవ్రతను బయటపెడుతోంది. వ్యక్తిగత ఫోటోలను దుర్వినియోగం చేయడం ఎంత ఘోర పరిణామాలను తెస్తుందో ఈ ఘటన చూపిస్తోంది. సంబంధిత సమస్యలు ఎదురైనవారు పోలీసులను సంప్రదించడం, న్యాయమార్గంలో పరిష్కారం కోరడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
