PM Modi Speech: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏ అంశాలపై మాట్లాడతారనేది అధికారికంగా వెల్లడికాలేదు. అయితే జీఎస్టి కొత్త రేట్లు, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, అమెరికా తీసుకున్న H-1B వీసా రుసుము పెంపు వంటి అంశాలపై ప్రధాన మంత్రి స్పష్టతనివ్వవచ్చని రాజకీయ వర్గాలు ఊహిస్తున్నాయి.
PM Modi Speech: రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా “వోకల్ ఫర్ లోకల్” పిలుపునిచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా. మణిపూర్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ పర్యటనల్లో కూడా మోదీ ఇదే విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రధాని పునరుద్ఘాటించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Election Commission: ఏపీలో 17, తెలంగాణలో 9 పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు.. ఈసీ సంచలన నిర్ణయం!
ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H-1B వీసా దరఖాస్తు రుసుము పెంపు నిర్ణయం కూడా భారతీయులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు ఈ వీసా కోసం దరఖాస్తు చేస్తారు. 2024లో మాత్రమే 3 లక్షల మందికి పైగా భారతీయులు ఈ వీసాను పొందారు. ఈ నేపథ్యంలో, భారత నిపుణులు, ఐటీ రంగంపై ఈ నిర్ణయం ప్రభావం గురించి మోదీ స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అంతకుముందు, మే 12న రాత్రి 8 గంటలకు జరిగిన ప్రసంగంలో మోదీ “ఆపరేషన్ సిందూర్”, పహల్గామ్ ఉగ్రదాడి, పీఓకే పరిస్థితి, ఉగ్రవాదం, సింధు జల ఒప్పందం, స్వదేశీ ఆయుధాలు వంటి పన్నెండు కీలక అంశాలపై దేశ వైఖరిని వివరించారు. అందువల్ల ఈరోజు ప్రసంగంలో కూడా బహుళ అంశాలు ప్రస్తావించబడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
