AdiVaani: భారత ప్రభుత్వం గిరిజన భాషలను కాపాడేందుకు ‘ఆదివాణి’ అనే AI ఆధారిత అనువాద యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ గిరిజన భాషలను ఇతర భాషలకు అనువదించడానికి సహాయపడుతుంది. కమ్యూనికేషన్ లోని అంతరాలను తగ్గించడం, గిరిజన సంస్కృతిని సంరక్షించడం ఈ యాప్ లక్ష్యం.
AdiVaani: మన దేశంలో ఎన్నో భాషలున్నప్పటికీ, చాలా భాషలకు లిపి లేదు. ముఖ్యంగా గిరిజన సమాజం మాట్లాడే అనేక భాషలు ఇప్పుడు అంతరించి పోతున్న దశలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటిని మన వారసత్వ సంపదగా భావిస్తూ సంరక్షించాలని నిర్ణయించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గిరిజన వ్యవహారాల మంత్రి దార్శనిక నాయకత్వంలో, గిరిజన భాషా పరిరక్షణ కోసం ఆదివాణి (బీటా వెర్షన్) యాప్ను అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై విస్తృతంగా పని చేసింది.
కమ్యూనికేషన్ అంతరాలను తగ్గించడం, భారతదేశ గొప్ప గిరిజన వారసత్వాన్ని సంరక్షించడం కోసం ఇది చారిత్రాత్మక అడుగుగా చుస్తున్నారు. ప్రస్తుతం ఈ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని, గిరిజన భాషల పరిరక్షణ మిషన్లో భాగమవ్వవచ్చు.
