School Holidays: దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?

School Holidays

School Holidays: విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే ఆనందం వర్ణనాతీతం. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్న సెలవులు దసరా పండగ కారణంగా భారీగా రానున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికే విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది మొత్తం 233 వర్కింగ్ డేస్ ఉండగా, 83 రోజులు సెలవులుగా ఖరారయ్యాయి.

School Holidays: ఈ ఆగస్ట్‌ నెలలోనే విద్యాసంస్థలకు పలు రోజుల పాటు సెలవులు వచ్చాయి. అయితే విద్యార్థుల కళ్ళన్నీ ఇప్పుడు అక్టోబర్‌ నెలవైపు తిరిగి ఉన్నాయి. ఎందుకంటే అక్టోబర్ 2న దసరా పండగ రానుండగా, దానికి ముందు నుంచే సెలవులు మొదలుకానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేకంగా సెలవులు ఇవ్వనున్నారు. ఇక తెలంగాణలో విద్యార్థులకు అదనంగా మరికొన్ని రోజులు లభించనున్నాయి. అక్కడ సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నట్లు సమాచారం.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఈ దసరా సందర్భంగా పెద్ద విరామం దక్కబోతోంది. ఆదివారాలు, రెండో శనివారాలు, ప్రత్యేక పండుగలన్నీ కలిపి ఈసారి విద్యార్థుల సెలవుల సంఖ్య మరింతగా పెరిగింది.

ఇక వర్షాల కారణంగా కూడా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఆగస్ట్ 18వ తేదీన పాఠశాలలకు భారీ వర్షాల కారణంగా అధికారులు సెలవులు ఇచ్చారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో, దసరా పండుగతో పాటు వర్షాల కారణంగా కూడా విద్యార్థులకు వరుసగా ఆనందం కలిగించే సెలవులు లభిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *