Weather Forecast: వర్షాల బీభత్సానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వణికిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాల్లో వరద పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాతావరణశాఖ మరో వారం రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలలో భాగంగా కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
రాష్ట్రంలోని యానాంలో పాటు కోస్తా ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీచుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులలో వాతావరణ పరిస్థితులు ఇలా ఉండనున్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
Weather Forecast: ఈరోజు, రేపటిరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. గంటకు 40–50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్లుండి కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే గాలుల వేగం 30–40 కి.మీ. మధ్యలో ఉండనుంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ & రాయలసీమ
ఈరోజు, రేపు ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40–50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎల్లుండి కూడా వర్షాలు కొనసాగుతాయని, గాలుల వేగం 30–40 కి.మీ. మధ్యలో ఉండనుందని అంచనా.
జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాల సమయంలో అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించమని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా తక్కువ భూమి ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
