Smuggling: షాకింగ్ ఘటన.. మహిళ బ్రాలో నాలుగు పాములు దాచుకుని పట్టుబడి అరెస్ట్

Smuggling: చైనాలో ఓ ఆశ్చర్యపరిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ఫెర్రీ బోటులో ప్రయాణానికి వచ్చిన ఒక మహిళను భద్రతా తనిఖీల సమయంలో అధికారులు చెక్ చేయగా, ఆమె బాడీ స్కాన్‌లో ప్రైవేట్ పార్ట్ దగ్గర ఏదో కదులుతూ కనిపించింది. దీంతో మరింతగా పరిశీలించగా నిజం బయటపడింది.

Smuggling: కాదేది కవితకు కానర్హం అన్నట్టుగా… ఈ సారి మహిళ తన శరీరంలోనే జీవం ఉన్న జంతువులను దాచుకుని అక్రమ రవాణాకు యత్నించింది. వివరాల్లోకి వెళ్తే – చైనాలోని ఫుటియన్ పోర్టు వద్ద భద్రతా తనిఖీల సమయంలో ఒక మహిళ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అధికారులు ఆమెను లోతుగా చెక్ చేశారు. ఆ సమయంలో బాడీ స్కాన్‌లో ఆమె బ్రాలో సాక్స్‌లలో చుట్టి పెట్టిన నాలుగు బాల్ పైథాన్‌లు (Python regius) బయటపడ్డాయి.

ఈ పాములు అంతరించిపోతున్న జాతుల్లో ఒకటని, IUCN రెడ్ లిస్టులో వీటిని ప్రమాదకర జాతిగా గుర్తించారని అధికారులు తెలిపారు. చైనాలో ఇవి రక్షిత జాతులుగా పరిగణించబడుతాయి. పెంపుడు జంతువులుగా ఉంచుకోవడం, వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. విచారణలో మహిళ “కొంత డబ్బుల కోసం ఎవరో చెప్పిన పనిని చేసానని” అంగీకరించింది. అధికారులు వెంటనే పాములను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదే తరహా ఘటన గత నెల అమెరికాలోనూ చోటుచేసుకుంది. మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక మహిళ తన బ్రాలో రెండు తాబేళ్లను దాచుకుని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడింది. వాటిలో ఒకటి చనిపోయినట్టుగా గుర్తించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *