PM Modi: ఆ రెండు రాష్ట్రాలకి వరాల జల్లు.. మోదీ ఎజెండా ఏంటి!

PM Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రెండు రాష్ట్రాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లలో సుడిగాలి పర్యటన చేస్తూ, పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రహదారులు, వంతెనలు, విద్యుత్‌ మరియు ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.

PM Modi: బీహార్‌లో ప్రధాని మోదీ మొత్తం రూ. 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇందులో మొకామా నుంచి బిగూసరాయ్ వరకు గంగానదిపై నిర్మించిన 8 కిలోమీటర్ల ఆరులేన్ల బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ వంతెన నిర్మాణానికి రూ. 1,870 కోట్లు ఖర్చు చేశారు. పాత బ్రిడ్జి స్థానంలో నిర్మించిన ఈ వంతెన ట్రాఫిక్ సమస్యలను తగ్గించనుంది. అదనంగా, ఒక జాతీయ రహదారి ప్రాజెక్ట్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

అలాగే బీహార్‌లో విద్యుత్‌ రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 6,880 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ప్రాంతీయ ఇంధన భద్రతను మెరుగుపరుస్తుంది. మరోవైపు, ఆరోగ్య రంగంలో భాగంగా ముజఫర్‌పూర్‌లో హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

బీహార్ పర్యటన పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌ వెళ్లనున్నారు. అక్కడ కూడా పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. జాతీయ రహదారి-31లోని భక్తియార్‌పూర్ – మొకామా సెక్షన్‌లో రూ. 1,900 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల రహదారిని ఆయన ప్రారంభించనున్నారు. దీని ద్వారా స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది.

అదనంగా కోల్‌కతా మెట్రోలో మూడు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరవుతారా లేదా అన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నేతలు మాత్రం బెంగాల్ అభివృద్ధి కోసం మమతా తప్పనిసరిగా హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నారు.

మొత్తంగా బీహార్‌, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటనలో రూ. 18 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులు ప్రారంభం అవ్వడం ద్వారా మౌలిక సదుపాయాలు, విద్యుత్‌, రవాణా రంగాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *