AP Minor Girl: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన పదో తరగతి బాలిక!

AP Minor Girl: ఆంధ్రప్రదేశ్‌ నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప గ్రామంలో దారుణం వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా కడుపునొప్పితో ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు ఆమె గర్భవతిగా ఉండటమే కాకుండా మగ శిశువుకు జన్మనిచ్చిందని నిర్ధారించారు. ఈ విషయం తల్లిదండ్రులు, గ్రామస్థులకు షాక్‌కు గురిచేసింది.

యువకుడి మాయలో పడిన బాలిక

AP Minor Girl: అదే గ్రామానికి చెందిన మనోహర్ (21) అనే యువకుడు బాలికను మాయమాటలు చెప్పి తన వలలోకి దించుకున్నాడు. ఆమెను మాటలతో మభ్యపెట్టి ఇంటికి తీసుకువెళ్లి, సుమారు ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతైంది.

ఆస్పత్రిలో బయటపడిన వాస్తవం

బాలికకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం డాక్టర్లు ఆమె గర్భవతిగా ఉందని గుర్తించారు. తొమ్మిది నెలల తర్వాత బాలిక మగ శిశువుకు జన్మనిచ్చింది.

పోలీసులు కేసు నమోదు

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు యువకుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అఘాయిత్యాలు ఆగని సమాజం

ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట మహిళలు, బాలికలపై ఇలాంటి అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ, అమాయక చిన్నారులను లక్ష్యంగా చేసుకుని నేరస్థులు ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *