Eluru: ఏలూరులో దారుణం.. ముళ్లపొదల్లో ఆరేళ్ల చిన్నారి విసిరేసిన తల్లితండ్రులు!

Eluru: ఏలూరులో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల అమాయక చిన్నారిని ముళ్ళ పొదల్లో విసిరేసిన ఘటన స్థానికులను కలచివేసింది. ఈ ఘటన ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి శివారు ప్రాంతం రైల్వే ట్రాక్ పక్కన జరిగింది.

Eluru: స్థానికులు అక్కడుగా వెళ్తుండగా, పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్నారిని గమనించి తల్లడిల్లిపోయారు. ఆమెకు తీవ్ర గాయాలున్నాయని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం చిన్నారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ట్రక్కును ఢీకొని ఐదుగురు దుర్మరణం!

ప్రాథమిక సమాచారం ప్రకారం, బాలిక వయసు ఆరేళ్లు. ఆమెకు మెదడు సరిగా ఎదగకపోవడం వల్ల బుద్ధి మాంద్యం ఉందని, అవయవాలు కూడా పూర్తిగా పనిచేయకపోవడం వల్లే తల్లిదండ్రులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు.

పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. చిన్నారికి మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య బృందం చర్యలు తీసుకుంటోంది.

ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక చిన్నారిని ఇలా నిర్దాక్షిణ్యంగా ముళ్ళ పొదల్లో వదిలేసిన తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సమాజంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు, కఠిన శిక్షలు తప్పనిసరి అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *