Deputy CM Pawan Kalyan: టీచర్స్ డే సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సర్ప్రైజ్ గిఫ్ట్స్ – గురువుల ఆనందం

Deputy CM Pawan Kalyan: తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవనీయమైన స్థానం గురువులదే. అందుకే “ఆచార్య దేవో భవ” అంటూ ఉపాధ్యాయుల పట్ల నమస్కారం వ్యక్తం చేస్తాం. ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న, భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో గురువుల్ని గౌరవించారు.

Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో ఉన్న సుమారు 2,000 మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక కానుకలు పంపారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేస్తున్న టీచర్స్‌కు చీరలు, ప్యాంట్-షర్ట్లు బహుమతులుగా అందించారు. ప్రత్యేకత ఏంటంటే, ఆ బహుమతులను ఆయా స్కూల్ విద్యార్థుల చేతుల మీదుగా ఉపాధ్యాయులకు అందజేశారు.

ఇది కూడా చదవండి: Tirumala Tirupati: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. డీడీ రూపంలో కళ్లు చెదిరే మొత్తం!

తమ సర్వీస్‌లో ఇంతవరకు ఇలాంటి బహుమతిని పొందలేదని అనేకమంది గురువులు ఆనందం వ్యక్తం చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఉపాధ్యాయులను సమస్యలతో ఇబ్బంది పెట్టే దృశ్యాలు చూసిన తమకు, మొదటిసారి నిజమైన గౌరవం లభించిందని వారు తెలిపారు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ రాఖీ పండుగ, వరలక్ష్మీ వ్రతం సందర్భాల్లో మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ పంపిణీ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం రోజున టీచర్స్‌ను గుర్తించి కానుకలు పంపించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం, పిఠాపురాన్ని రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా ఒక ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నారు. ప్రజల సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే నాయకత్వం ఆయనదేనని స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *