CM Chandrababu: ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ జారీ – సీఎం చంద్రబాబు

CM Chandrababu: ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ తప్పనిసరిగా విడుదలవుతుందని ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగిన ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

CM Chandrababu: మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందజేస్తూ సీఎం మాట్లాడుతూ – “సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశాను. అవినీతి లేని పారదర్శక పద్ధతిలో టీచర్ల నియామకాలు చేపట్టాం. ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ జరగడం ఖాయం” అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Bank Holidays: అక్టోబర్‌లో 20 రోజుల పాటు బ్యాంకులు బంద్ – వినియోగదారులు తెలుసుకోవాల్సిన వివరాలు!

ఈ కార్యక్రమంలో 15,941 మంది కొత్త టీచర్లకు నియామక పత్రాలు అందజేశారు. అన్ని జిల్లాల నుంచి కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.

చంద్రబాబు మాట్లాడుతూ –“15 ఏళ్లలో 14 సార్లు డీఎస్సీ పెట్టాం. దాంతో దాదాపు 1,96,619 ఉద్యోగాలు ఇచ్చాం. ఈసారి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ఉద్యోగ భరోసా ఇచ్చాం.” “పేదరికం లేని సమాజాన్ని చూడాలంటే విద్యే మార్గం. మహిళలే మంచి టీచర్లు అవుతారని నమ్మకం. అందుకే మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం.” “విద్యా రంగాన్ని నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత చదువుల వరకు బలంగా ఉండాలి. టీచర్లు పిల్లల్లో నైతిక విలువలు, నైపుణ్యాలు పెంచేలా బోధించాలి” అని అన్నారు.

టీచర్ల బాధ్యతలు విలువలతో కూడిన విద్య అందించాలి. పిల్లల నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము అప్డేట్ చేసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా బోధనలో కొత్త పద్ధతులు అనుసరించాలి.

సీఎం మాట్లాడుతూ – “ఏపీలో ఒక చేతకాని పక్షం ఉంది. వారు మంచి జరగనివ్వరు. డీఎస్సీని అడ్డుకునేందుకు 106 కేసులు వేశారు. కానీ మేము ప్రతిభ ఆధారంగా నియామకాలు పూర్తి చేశాం. 2019-24 మధ్య విద్యా రంగం నాశనం అయింది. తెలుగు మీడియంను రద్దు చేసి, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు” అని గత పాలనను విమర్శించారు.

ఈసారి జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొత్తగా నియమితులైన టీచర్లతో ముఖాముఖి కూడా జరిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి సమాజానికి మంచి పేరు తెచ్చేలా బోధించాలని సీఎం సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *