OG Movie Heroine: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ సుజీత్ రూపొందించిన ఈ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
OG Movie Heroine: సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో అలరిస్తే, యాక్షన్ సీన్స్, డైలాగ్స్, ఎలివేషన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌ను పూనకాలు తెప్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పవన్ అభిమానులు ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా సహా పలువురు ఫ్యామిలీ సభ్యులు కూడా థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేశారు.
ఇది కూడా చదవండి: OG Movie First Review: ఓజీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. థియేటర్లు దద్దరిల్లిపోతాయ్!
ఇక ఈ సినిమా హైలైట్‌గా నిలుస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా? యాంక అరుళ్ మోహన్. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తక్కువ సినిమాలే చేసినా మంచి క్రేజ్ సంపాదించింది. శ్రీకారం సినిమాలో నటించినా, అది పెద్దగా విజయాన్ని అందుకోలేదు. తర్వాత తమిళ సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ వైఫ్‌గా స్క్రీన్‌పై కనిపించిన ప్రియాంక, తన నేచురల్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో ఆమె ఖాతాలో మరో పెద్ద హిట్ చేరింది. ఇప్పుడు అభిమానులంతా “ఓజీ హీరోయిన్”గా ప్రియాంక పేరును నోరూరిస్తున్నారు.
View this post on Instagram
