Chiranjeevi Birthday Special: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన ఎలాంటి సినిమాతో వచ్చినా బాక్సాఫీస్ హల్చల్ గ్యారెంటీ. కుర్ర హీరోలతో పోటీ పడుతూ, వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. వాల్తేరు వీరయ్య విజయాన్ని అందుకున్న తర్వాత ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Chiranjeevi Birthday Special: ఈ మూవీలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే, చిరు చేయబోయే తరువాతి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈసారి ఆయన కాంబినేషన్‌లోకి ఎంటరైనది మాస్, ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్స్ మాస్టర్ అనిల్ రావిపూడి.
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబినేషన్ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ఈ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. టీజర్లో మొదట విక్టరీ వెంకటేష్ వాయిస్‌తో టైటిల్ రివీల్ చేయడం అభిమానులకు డబుల్ ఫెస్టివల్ లా మారింది. “మన శంకరవరప్రసాద్ గారు పండగకి వచ్చేస్తున్నారు” అని వెంకీ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌లో ఊహించని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఆ రెండు రాష్ట్రాలకి వరాల జల్లు.. మోదీ ఎజెండా ఏంటి!
టైటిల్ గ్లింప్స్‌లో చిరంజీవి లుక్ హైలైట్ అయ్యింది. సూట్ వేసుకొని స్టైలిష్‌గా కారులో నుంచి దిగుతూ, చేతిలో సిగరెట్‌తో కనిపించిన షాట్ అదిరిపోయింది. చివరిలో గుర్రం పట్టుకొని నడుస్తూ వస్తున్న సీన్ అయితే మాస్ ఫీల్‌తో పాటు క్లాస్ లుక్ కూడా అందించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎస్.ఎస్. థమన్ కంపోజ్ చేసిన బీమ్స్ మ్యూజిక్ ఫ్యాన్స్‌ని థ్రిల్ చేసింది. ఒకే ఒక్క గ్లింప్స్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది.
అంచనాలను పెంచిన అనిల్ రావిపూడి – చిరు కాంబినేషన్
ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి చేసిన సినిమాలన్నీ మాస్, కామెడీ, ఎమోషన్స్ కలగలిపినవే. ఈసారి అలాంటి పర్ఫెక్ట్ మాస్ కామెడీ ఎంటర్టైనర్ని చిరుతో చేస్తుండటం వల్ల అంచనాలు ఆకాశాన్నంటాయి. చిరు మాస్ ఎనర్జీ, అనిల్ కామెడీ టచ్ కలిస్తే టాలీవుడ్ బాక్సాఫీస్ దద్దరిల్లనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
చిరంజీవి పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ టైటిల్ గ్లింప్స్ ఫ్యాన్స్‌ని ఫుల్ హ్యాపీ చేసింది. స్టైల్, క్లాస్, మాస్ – అన్నీ మిక్స్ అయిన ఈ గ్లింప్స్ అనిల్ రావిపూడి మరో సాలిడ్ హిట్ అందించనున్నాడనే నమ్మకాన్ని కలిగిస్తోంది. మెగాస్టార్ క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ వస్తే, ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు అవడం ఖాయం.
