Manish Elimination: మనీశ్ ఎలిమినేషన్ వెనక ఉన్న కారణాలు.. షో ద్వారా సంపాదన ఎంతంటే?

Manish Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా కొనసాగుతోంది. రెండో వారం ఎలిమినేషన్‌లో కామనర్ మర్యాద మనీశ్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. మొదటి వారంలో మంచి గేమ్ ఆడినప్పటికీ, రెండో వారంలో అతని ప్రవర్తన, ఆలోచన తీరు ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఎలిమినేషన్ తప్పలేదు.

Manish Elimination: మనీశ్‌ హౌస్‌లో ప్రతి విషయాన్ని ఓవర్‌గా ఆలోచించడం, చిన్న విషయాలనూ వంద కోణాల్లో చూడటం అతనికి మైనస్ పాయింట్ అయ్యింది. అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ భరణితో మనీశ్ వ్యవహరించిన తీరు ఆడియెన్స్‌కు అస్సలు నచ్చలేదు. నామినేషన్స్‌లో కూడా పని పట్టుకుని టెనెంట్స్‌ను నామినేట్ చేయడం అతని మీద నెగటివ్ ఇంపాక్ట్ కలిగించింది. ఈ కారణాలే మనీశ్ ఎలిమినేషన్‌కు దారి తీశాయని రివ్యూవర్స్ అభిప్రాయం.

ఇది కూడా చదవండి: Video Controversy: మరో కాంట్రవర్సీలో బిగ్ బాస్ బ్యూటీ .. హీరో భార్య బయటపెట్టిన వీడియోలు కలకలం!

రెండో వారం నామినేషన్స్‌లో మనీశ్‌తో పాటు సుమన్‌శెట్టి, ప్రియ, డిమోన్ పవన్, హరిత హరీశ్, ఫ్లోరా షైనీ, భరణి ఉన్నారు. చివరికి మనీశ్, ఫ్లోరా మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రేక్షకుల ఓట్లతో ఫ్లోరా సేఫ్ అవగా, మనీశ్ బయటకు వచ్చాడు.

మనీశ్ తనను స్టార్టప్ ఫౌండర్‌గా పరిచయం చేసుకున్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవనంలో మంచి సంపాదన ఉన్నప్పటికీ, బిగ్ బాస్ ద్వారా కూడా అతను మంచి రెమ్యునరేషన్ పొందాడు. సమాచారం ప్రకారం, మనీశ్ వారానికి రూ.60 నుంచి 70 వేల వరకు పారితోషికం పొందాడు. ఈ లెక్కన రెండు వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆయన దాదాపు రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు సంపాదించాడని చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Maryada Manish (@maryada.manish)

గతంలో కూడా ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నప్పుడు ఒక కంటెస్టెంట్‌గా కనిపించిన మనీశ్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో సందడి చేసి బయటకు వచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Maryada Manish (@maryada.manish)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *