Bigg Boss 9: ఎలిమినేట్ అయిన సంజన.. ఒక్కొక్కరిపై రెచ్చిపోయి ఇచ్చిపడేసింది!

Bigg Boss 9: బిగ్‌బాస్ సీజన్ 9 మూడో వారం కొత్త మలుపులతో సాగుతోంది. హౌస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్య నిఖితా కామనర్స్‌పై తనదైన స్టైల్‌లో షాకిచ్చింది. ఇక కెప్టెన్సీ టాస్కులు, గొడవలు, మిడ్‌వీక్ ఎలిమినేషన్‌తో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యిందని ముందే ఊహించినట్లుగానే సంజన బయటకు వెళ్లిపోయింది.

Bigg Boss 9: తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున స్టేజ్ పైకి పిలిచిన సంజన, హౌస్‌లో ఉన్న వారిపై తన అభిప్రాయాలు చెబుతూ ఒక్కొక్కరిపై రెచ్చిపోయింది. “ఎలా ఎలిమినేట్ అయ్యానో అర్థం కావడం లేదు సార్” అంటూ మొదలు పెట్టిన సంజన, హౌస్‌మేట్స్ బిహేవియర్‌పై ఓపెన్‌గా స్పందించింది.

ఇది కూడా చదవండి: Bigg Boss 9 Telugu: సంజన ఎలిమినేషన్ తో వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్!

సుమన్ శెట్టిపై “దేనికి స్టాండ్ తీసుకోడు” అని ఫైర్ అయ్యింది. శ్రీజపై “వర్స్‌ట్ ఆర్గ్యుమెంట్స్ నుంచి ఇంకా వర్స్‌ట్‌కి దిగింది” అంటూ సెటైర్లు వేసింది. హరీష్‌ గురించి మాట్లాడుతూ “ఏం చెప్పినా గొడవకు వచ్చేస్తాడు.. తానే ప్రైమ్ మినిస్టర్ లా ఫీల్ అవుతుంటాడు” అని రెచ్చిపోయింది.

రాము రాథోడ్ విషయానికి వస్తే, సంజన ఘాటుగానే స్పందించింది. “కొంతమందిని పెద్దగా, కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తాడు.. ఎంత చీప్ అన్నాడని నాకు రికార్డింగ్ కూడా ఉంది” అంటూ అతనిపై మండిపడింది.

ఇక ఇమ్మాన్యుయేల్‌ విషయానికి రాగానే మాత్రం ఎమోషనల్ అయ్యింది. ఇమ్మూ తలపెట్టి ఏడవగా, “నాకు మా అమ్మ గుర్తొచ్చింది” అని చెప్పడంతో సంజన కూడా కన్నీళ్లకు లోనైంది.

మొత్తం మీద, స్టేజ్‌పై సంజన ఇచ్చిపడేసిన కామెంట్స్ బిగ్‌బాస్ హౌస్‌లో మరోసారి రచ్చ రేపాయి. ప్రేక్షకులలో ఆసక్తి మరింత పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *