Viral Grandmother: సెలవులను తన నానమ్మ ఇంట్లో గడపడానికి వచ్చిన ఇద్దరు చిన్నారులపై విషాదం చోటు చేసుకుంది. నానమ్మ చేసిన కేక్ తినడంతో పిల్లలు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. ఆపై ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Grandmother: పోలీసుల సమాచారం ప్రకారం, 59 ఏళ్ల ఇజాబెల్ అనే మహిళ తన మనవరాళ్ల కోసం కేక్ తయారు చేసింది. అయితే అందులో విషం కలిపినట్లు తేలింది. 9 ఏళ్ల బాలిక అలానా ఆ కేక్ తినగానే కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. 11 ఏళ్ల మరో బాలిక తక్కువ మోతాదులో తిన్నందువల్ల స్వల్పంగా లక్షణాలు కనిపించాయి. ఆశ్చర్యకరంగా, ఆ కేక్ తిన్న వారి పెంపుడు పిల్లి కూడా అక్కడికక్కడే చనిపోయింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఒడిశాకు ప్రధాని మోదీ కానుక: దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్ ప్రారంభం!
తీవ్ర అస్వస్థతకు గురైన ఆ ఇద్దరు పిల్లలను తాతయ్య, నానమ్మలు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే దురదృష్టవశాత్తూ 9 ఏళ్ల అలానా మార్గమధ్యంలోనే మృతిచెందింది. ఈ ఘటన జూలై 23న చోటుచేసుకోగా, ఆ ఇంట్లో మిగిలిన కేక్ నమూనాలు, చనిపోయిన పిల్లి కళేబరాన్ని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారు.
ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం, కేక్లో ఇంకా చిన్నారి శరీరంలో టెర్బుఫోస్ అనే పురుగుమందు త్రేసులు గుర్తించబడ్డాయి. ఈ రసాయనం మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు నాడీ వ్యవస్థపై దాడి చేసి, కండరాల బలహీనత, మూర్ఛలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తుందని నిపుణులు తెలిపారు.
ఈ కేసులో పోలీసులు సెప్టెంబర్ 19న ఇజాబెల్ను అరెస్ట్ చేశారు. అయితే ఆమె తన మనవరాళ్లను ఎందుకు చంపిందనే అసలు మిస్టరీ ఇంకా బయటపడలేదు. గత క్రిస్మస్ సమయంలో కూడా ఆమె తన భర్త కుటుంబంలోని ఆరుగురికి విషం ఇచ్చి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.
