Video Controversy: మరో కాంట్రవర్సీలో బిగ్ బాస్ బ్యూటీ .. హీరో భార్య బయటపెట్టిన వీడియోలు కలకలం!

Video Controversy: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్‌, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో రీతూ ఒక టాలీవుడ్ హీరోతో కలిసి ఫ్లాట్‌లోకి వెళ్లడం, అనంతరం మత్తులో తూలుతూ బయటకు రావడం కనిపిస్తోంది. దీంతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది.

Video Controversy: ఈ వీడియోలను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమి బయటపెట్టింది. గౌతమి టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య. కొద్దిరోజుల క్రితం ఆమె తన భర్తపై అదనపు కట్నం వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. అప్పట్లోనే తన భర్త మరో మహిళతో రిలేషన్‌లో ఉన్నాడని గౌతమి పేర్కొన్నప్పటికీ, ఆ యువతి పేరు వెల్లడించలేదు. ఇప్పుడు మాత్రం ఆమె రీతూ చౌదరి పేరును తెరమీదకి తీసుకొచ్చి సంచలనానికి కారణమైంది.

ఇది కూడా చదవండి: Indigo Flight: ఎలుక తెచ్చిన తంట..ఇండిగో విమానంలో కలకలం.. ప్రయాణికులలో భయాందోళన!

గౌతమి విడుదల చేసిన వీడియోల్లో రీతూ, ధర్మ మహేష్ కలిసి ఒక ఫ్లాట్‌లోకి వెళ్లడం, బయటకు రావడం కనిపించడం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. అంతేకాకుండా, గౌతమి షేర్ చేసిన కొన్ని స్క్రీన్‌షాట్లలో రీతూ పేరునే ప్రస్తావిస్తూ తన భర్తతో గొడవలు జరిగాయని స్పష్టమవుతోంది.

ఇక ధర్మ మహేష్ విషయానికి వస్తే, సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో గౌతమిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 2023లో వారికి బాబు పుట్టాడు. అయితే, అదే సమయంలో భర్త రీతూ చౌదరితో సంబంధం పెట్టుకున్నాడని గౌతమి ఆరోపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Gauthu ch (@gautamy_chowdary)

ప్రస్తుతం ఈ వ్యవహారం మీద సోషల్ మీడియాలో చర్చలు జోరుగా నడుస్తున్నాయి. నిజంగానే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందా? లేక కేవలం డ్రగ్స్ తీసుకునేందుకే కలిసారా? అనే ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *