Indigo Flight: ఎలుక తెచ్చిన తంట..ఇండిగో విమానంలో కలకలం.. ప్రయాణికులలో భయాందోళన!

Indigo Flight: కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఒక ఎలుక కనిపించడం ప్రయాణికుల్లో కలకలం రేపింది. టేకాఫ్‌కు కొన్ని నిమిషాల ముందే విమానంలో ఎలుక సంచరిస్తున్నట్లు గమనించడంతో, వెంటనే విమానాన్ని ఆపివేసి అందరినీ బయటకు తరలించారు.

Indigo Flight: విమానంలో ఉన్న మొత్తం 172 మంది ప్రయాణికులను భద్రతా కారణాల దృష్ట్యా లాంజ్‌కు తరలించారు. సిబ్బంది, టెక్నికల్ బృందం దాదాపు మూడు గంటలపాటు శోధన జరిపి చివరికి ఎలుకను పట్టుకున్నారు. ఈ లోగా కొంతమంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోగా, మరికొందరు రీషెడ్యూల్ చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Stock Market Scam: స్టాక్ మార్కెట్ పేరు మీద కొత్త మోసం.. ఫేక్ యాప్స్, ఐపీఓ స్కామ్స్‌కు జాగ్రత్త!

ఆలస్యంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, విమానాశ్రయ అధికారులు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విమానం పూర్తిగా సురక్షితమని నిర్ధారించిన తరువాత మాత్రమే క్లియర్ చేసినట్లు తెలిపారు. చివరికి సాయంత్రం 6:04 గంటలకు విమానం 111 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది.

ఈ ఘటనపై ఇండిగో విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *