Nimisha Priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు సంబంధించి యెమెన్లో విధించిన ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేయడం దేశవ్యాప్తంగా ఊరట కలిగించింది. 2017లో జరిగిన హత్య కేసులో యెమెన్ న్యాయస్థానం నిమిషా ప్రియకు ఉరిశిక్ష విధించగా, 2024 జూలై 16న ఆమెకు శిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో, హుతీ పాలిత యెమెన్ ప్రభుత్వం, హత్యకు గురైన తలాల్ కుటుంబంతో జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
Nimisha Priya Case: తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం, గిరిజన నాయకులతో జరిగిన కీలక చర్చల అనంతరం నిమిషాకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ చర్చల వేదికను సిద్ధం చేసిన ప్రముఖ సూఫీ నేత కాంతాపురం ఎపి అబూబకర్ ముస్లియార్ జోక్యం ఈ పరిణామానికి దోహదపడింది. దీనికి స్పందనగా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది.
ఇది కూడా చదవండి: Breaking News: చిరంజీవి పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. GHMCపై ఆదేశాలు జారీ
అసలేం జరిగిందంటే…
Nimisha Priya Case: పాలక్కాడ్కు చెందిన నిమిషా ప్రియ 2011లో ఉపాధి కోసం యెమెన్కు వెళ్లారు. అక్కడ తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తితో భాగస్వామ్యంలో క్లినిక్ ప్రారంభించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తలాల్ తనను వివాహం చేసుకున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించి, పాస్పోర్ట్ను హరించాడని నిమిషా ఆరోపించారు. పైగా, శారీరక, ఆర్థిక వేధింపులు ఎదురై, తనను వదిలించుకోవాలని భావించి మత్తు మందులు ఇచ్చారట. అయితే, మోతాదుకు మించి తలాల్ మరణించడంతో, అది హత్య కేసుగా మారింది.
నిమిషా హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసి పారేసిందని ఆరోపణల మధ్య, 2020లో ఆమెకు యెమెన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2023లో హౌతీ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఈ శిక్షను సమర్థించింది. చివరకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగడంతో పాటు, నిమిషా కుటుంబం కూడా రూ. 11 కోట్లు (1 మిలియన్ డాలర్లు) బ్లడ్ మనీగా చెల్లించేందుకు సిద్ధమైంది.
ఇది కూడా చదవండి: Nimisha Priya Case: మరణశిక్ష రద్దుకై చివరి పోరాటం.. హూతీల చట్టాల్లో ఉన్న గడియార శబ్దమే ఆశ!
కేంద్రం ప్రయత్నాలు…
ఈ కేసులో భారత్ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. సుప్రీంకోర్టులో నిమిషా తరఫున పిటిషన్ దాఖలయ్యింది. కేంద్ర ప్రభుత్వం కూడా దౌత్య మార్గం, బ్లడ్ మనీ చర్చలు, ప్రభుత్వ స్థాయి ఒప్పందాలు ఇలా అన్ని వైపుల నుంచి నిమిషాను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. బ్లడ్ మనీని ఆమోదించే దిశగా తలాల్ కుటుంబంతో చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ తాత్కాలిక వాయిదాతో నిమిషా ప్రాణాలకు ఉపశమనం లభించినప్పటికీ, ఈ కేసు పూర్తిగా పరిష్కారం కావాల్సిన అవసరం ఇంకా ఉంది. నిమిషా ప్రియ క్షమాభిక్ష పొందాలంటే బాధిత కుటుంబం పర్మిషన్ అవసరం. అందుకే ఇప్పుడు జరుపుతున్న సంప్రదింపులు కీలకం.
