India vs England: లార్డ్స్ వేదికగా భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ.. భారత్ చివరకు కేవలం 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టెయిల్-ఎండర్లు చేసిన పోరాటం ప్రశంసలు అందుకున్నా.. అసలు ఎందుకు ఓడిందీ భారత్? ఎవరి తప్పిదాల వల్ల ఈ ఫలితం వచ్చిందన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాను ఓటమి దిశగా నడిపించిన ఐదుగురు ఆటగాళ్లు పేర్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
1. యశస్వి జైస్వాల్ – జోఫ్రా ధాటికి లైన్ తప్పిన ఓపెనర్
యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ పేస్‌కు ఎదురులేక ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఔటయ్యాడు. రెండూ ఇన్నింగ్స్‌ల్లో రెండంకెల మార్క్ దాటలేకపోయిన జైస్వాల్, భారత్ బ్యాటింగ్ లైనప్‌ను ఒత్తిడిలోకి నెట్టిన మొదటి కారకుడు.
2. కరుణ్ నాయర్ – జట్టును మోసిన ‘సైలెంట్ ఫెయిల్యూర్’
అభిమానుల అంచనాలకు వ్యతిరేకంగా, కరుణ్ నాయర్ మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు. టెస్ట్ క్రికెట్‌కు చాలా రోజుల తర్వాత తిరిగొచ్చిన నాయర్, తనను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు. కీలక సమయంలో దారుణంగా ఫెయిలవడంతో, అతని వైఫల్యం భారత్‌పై ప్రభావం చూపించింది.
3. ఆకాశ్ దీప్ – రెగ్యులర్ ప్లేయర్ల స్థాయికి తగ్గట్టేనా?
బౌలింగ్‌తో ఆకట్టుకున్నా, బ్యాటింగ్‌లో పెద్దగా సహకరించలేకపోయాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో 5వ స్థానంలో భారీ అంచనాలతో వచ్చినా.. ఖాతా లేకుండానే పెవిలియన్ చేరాడు. అతడి వికెట్ తర్వాత భారత్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది.
4. రిషబ్ పంత్ – స్వల్ప నిర్ణయం.. తీవ్ర పరిణామం
తన సహజ ఆటతీరులోనే తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల వద్ద ఓ సింగిల్ రన్ కోసం ప్రయత్నిస్తూ వికెట్ కోల్పోయాడు. ఇది ఆ ఇన్నింగ్స్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ 9 పరుగులకే బౌల్డ్ అయ్యాడు. పంత్ విఫలమైన రెండు సందర్భాలు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించాయి.
5. అనుభవ లేని మిడ్ ఆర్డర్ – జట్టు స్పైన్లెస్గా మిగిలింది
సగం జట్టు అనుభవ రాహిత్యంతో డొమినేట్ చేయలేకపోయింది. మెయిన్ బ్యాట్స్‌మెన్ నుంచి స్పెషల్ షాట్లు, ఫైటింగ్ ఇన్నింగ్స్‌లు లేకపోవడం ఓటమికి దారితీసింది.
ఫలితంగా?
ఇంగ్లాండ్ విజయం కన్నా టీమిండియా ఓటమి ఎక్కువగా చర్చకు వస్తోంది. కొన్ని అద్భుత కదలికలు చేసినా, వరుస తప్పిదాలతో మ్యాచ్‌ను చేతులు కోల్పోయిన భారత జట్టులో “విలన్ల” జాబితా ఇప్పుడు అభిమానుల గుసగుసలకు కేంద్రంగా మారింది.
