ACP Death: ‘పుష్ప 2’ తొక్కిసలాట కేసుతో గుర్తింపు పొందిన ఏసీపీ మృతి!

ACP Death: సంధ్యా థియేటర్‌ ఘటనలో వార్తల్లో నిలిచిన మాజీ ఏసీపీ విష్ణుమూర్తి హఠాన్మరణం. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు పోలీస్‌ శాఖ వెల్లడించింది. ఆదివారం రాత్రి (అక్టోబర్‌ 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఈ వార్త పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ACP Death: విష్ణుమూర్తి పేరు గతంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2024 డిసెంబర్‌లో ‘పుష్ప 2’ విడుదల సందర్భంగా హీరో అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ను సందర్శించారు. అయితే అభిమానులు భారీగా తరలి రావడంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఇది కూడా చదవండి: Father Trap: గంజాయికి బానిసైన కొడుకు.. తండ్రి చేసిన ప్లాన్‌ చూస్తే ఆశ్చర్యం!

ఈ సంఘటన తర్వాత అల్లు అర్జున్‌పై మాజీ ఏసీపీ విష్ణుమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అల్లు అర్జున్‌కి చట్టంపై ప్రాథమిక అవగాహన లేదు” అంటూ ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి హీరోకి వార్నింగ్ జారీ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అయితే అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టినందుకు విష్ణుమూర్తిపై అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. డీసీపీ అక్షాంష్ యాదవ్ అప్పట్లో “విష్ణుమూర్తి ప్రవర్తన పోలీసు నియమావళిని ఉల్లంఘించింది. ఇలాంటి చర్యలను భరించబోమని” స్పష్టం చేశారు.

అంతకుముందు ఆయన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత సర్వీసు నుంచి రిటైర్ అయిన విష్ణుమూర్తి, కొంతకాలంగా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు.

విష్ణుమూర్తి మృతిపట్ల పలువురు పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. “విష్ణుమూర్తి క్రమశిక్షణ గల అధికారి, ఆయన మరణం పోలీస్‌ వ్యవస్థకు నష్టం” అంటూ పలువురు స్పందించారు.

‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్‌పై కేసులు నమోదయ్యి, అరెస్ట్ అయినా అనంతరం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *