Team India: భారత క్రికెట్లో వికెట్ కీపర్–బ్యాట్స్‌మన్ స్థానం కోసం ఇంతకుముందెన్నడూ లేనంతగా పోటీ నెలకొంది. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ మాత్రమే కాకుండా, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు కూడా జట్టులో చోటు కోసం పోటీపడుతున్నారు. అయితే, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో జురెల్ ప్రదర్శిస్తున్న నిలకడ, అతని టెక్నిక్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలు అతన్ని పంత్‌కు ప్రత్యామ్నాయంగా నిలబెట్టాయి.
Team India: ఇటీవల ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో జురెల్ అద్భుత శతకం సాధించాడు. 132 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేవలం రన్స్ మాత్రమే కాకుండా, ఒత్తిడిలో ఆడిన తీరు, ప్రదర్శించిన టెక్నిక్ క్రికెట్ విశ్లేషకులను మెప్పించాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 90 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన జురెల్ ఈసారి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు.
ఇది కూడా చదవండి: Handshake Controversy: పాక్ నాటకం బహిర్గతం.. అసలు బాధ్యత ఎవరిదో బయటపడింది!
ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే, రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని మళ్లీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సెంచరీతో అదరగొట్టాడు. పంత్ తన దూకుడు బ్యాటింగ్‌తో టెస్ట్ క్రికెట్లో కొత్త నిర్వచనం ఇచ్చాడు. అయితే, ఫామ్, ఫిట్నెస్ విషయంలో ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జురెల్ ప్రదర్శన పంత్‌కు గట్టి హెచ్చరికలా మారింది.
భారత క్రికెట్లో వికెట్ కీపర్–బ్యాట్స్‌మన్ స్థానం కోసం భవిష్యత్తులో సెలెక్టర్లకు కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది. దూకుడు గేమ్‌తో మ్యాచ్‌ను ఒక్కడే మార్చే పంత్‌కా, లేక సంప్రదాయ టెస్ట్ స్టైల్లో నిలకడగా ఆడే జురెల్కా? అనే చర్చ రాబోయే నెలల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.
