Father Trap: గంజాయికి బానిసైన కొడుకు.. తండ్రి చేసిన ప్లాన్‌ చూస్తే ఆశ్చర్యం!

Father Trap: మంగళగిరి మండలంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 1972 నంబర్‌కి ఒక తండ్రి ఫోన్ చేసి, తన కొడుకు గంజాయికి బానిసైపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలాగైనా తన కుమారుడు ఆ వ్యసనాన్ని మానాలని పోలీసులను కోరాడు. ఈ ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిపై నిఘా పెట్టగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Father Trap: పోలీసుల దర్యాప్తులో మంగళగిరి నగరంలో భారీ స్థాయిలో గంజాయి విక్రయం జరుగుతోందని తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం — మంగళగిరి మండలం బేతపూడికి చెందిన చందు, పెదవడ్లపూడికి చెందిన ఆనంద్ అలియాస్ బొజ్జా గంజాయి విక్రయం ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి కేజీ గంజాయి ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.500కి విక్రయించడం ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Viral Video: ముంబైలో షాకింగ్ ఘటన.. డెలివరీ ఇచ్చేందుకు వచ్చి మహిళను ఛీ..ఛీ!

ఇదంతా అక్కడితో ఆగలేదు. ఈ గంజాయి ప్యాకెట్లతో పాటు సిగరెట్లు కూడా విక్రయించడం మొదలుపెట్టారు. విద్యార్థులను ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించారు. మంగళగిరి క్రికెట్ స్టేడియం సమీపంలో ఉంటూ, అక్కడకు వచ్చే యువకులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన అనే ఆశతో ఈ దందా కొనసాగిస్తున్నారు.

తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెంచి ఈ చీకటి దందాను బట్టబయలు చేశారు. దీంతో అక్రమ గంజాయి వ్యాపారంలో పాల్గొన్న చందు, బొజ్జా, బాపిస్టు పేటకు చెందిన బుల్లా రవి, ఆత్మకూరుకు చెందిన తేజ, చైతన్య, లక్ష్మణరావు అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మంగళగిరి పోలీసులు తెలిపారు — “ఒక తండ్రి చాకచక్యంతో ఇంత పెద్ద ముఠాను పట్టుకోవడం సాధ్యమైంది. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించిన వెంటనే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని సూచించారు. తల్లిదండ్రుల అప్రమత్తతతో అనేక కుటుంబాలు రక్షించబడతాయని, యువతను డ్రగ్ మాఫియా బారిన పడకుండా కాపాడేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *